నువ్వు బన్నీ వి కాదు, నిజంగా కన్నివే.....!!

GVK Writings

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో మొత్తానికి మొన్నటి సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయాన్ని అందుకోవడం జరిగింది. అల్లు అర్జున్ ఒక మధ్యతరగతి యువకుడిగా నటించిన ఈ సినిమాలో అక్కినేని సుశాంత్, టబు, మురళి శర్మ, నివేత పేతురాజ్ కీలక పాత్రల్లో నటించగా ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించడం జరిగింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హీరోయిన్ గా గోల్డెన్ లెగ్ భామ పూజ హెగ్డే హీరోయిన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో సినిమా యూనిట్ ఎంతో ఆనందాన్నిఆ వ్యక్తం చేస్తోంది. సినిమా సక్సెస్ అయి, ఇప్పటికీ కూడా మంచి కలెక్షన్స్ రాబడుతుండడంతో మూవీ యూనిట్ నేడు హైదరాబాద్ లో ఒక సక్సెస్ మీట్ ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సక్సెస్ మీట్ లో దర్శకుడు త్రివిక్రమ్ తో పాటు హీరో అల్లు అర్జున్ కూడా పాల్గొని మీడియా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. 

 

ఇక తన బావ అయిన ఎన్టీఆర్ సినిమా చూసి బాగుందని ప్రత్యేకముగా ట్వీట్ చేయడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, అందుకు తారక్ కు ప్రత్యేక అభినందనలు తెలిపిన బన్నీ, తన ఫ్రెండ్ ప్రభాస్ బాహుబలి సినిమాలతో సూపర్ సక్సెస్ ని అందుకోవడంతో పాటు ఆయన మైనపు విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ లో ఏర్పాటు చేయడం తనకు ఎంతో సంతోషం కలిగించిందని అన్నారు. అయితే ఇప్పుడు ఈ విషయమై టాలీవుడ్ లో ముఖ్యంగా కొందరు మహేష్ ఫ్యాన్స్ కు తీవ్ర ఆగ్రహావేశాలు తెప్పిస్తున్నాయి. నిజానికి బాహుబలి వంటి పాన్ ఇండియా ఫీల్ ఉన్న సినిమాలు చేసిన ప్రభాస్ కు ఆ రేంజ్ ఫాలోయింగ్ రావడం, ఆపై ఆయనకు టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం ఏర్పాటు చేయడం గురించి మాట్లాడిన బన్నీ, 

 

కేవలం తెలుగు సినిమాల్లో నటిస్తూ, అటు జాతీయ స్థాయిలో బాలీవుడ్ నటులను తలదన్నుతూ మోస్ట్ డిజైరబుల్ మెన్ గా ఒకసారి రెండు, మరొకసారి మూడవ స్థానం తో పాటు ఇటీవల ఫరెవర్ డిజైరబుల్ మ్యాన్ గా నిలిచిన మహేష్ బాబు విషయం గుర్తు లేదా, అలానే కేవలం తెలుగు సినిమాల్లో నటిస్తున్న మహేష్ కు కూడా అదే మేడం టుస్సాడ్స్ లో మైనపు విగ్రహం ఏర్పాటు చేసిన విషయం బన్నీకి తెలియదా అంటూ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విమర్శలు ఎక్కుపెడుతున్నారు. మిమ్మలి అందరూ బన్నీ అని కాకుండా కన్ని అని ఎందుకంటారో ఇప్పుడు అర్ధం అవుతుందని మరికొందరు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. దీనిపై బన్నీ ఫ్యాన్స్ కూడా గట్టిగా వారికి ప్రతి విమర్శలతో రిటార్ట్ ఇస్తున్నారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: