కుర్రహీరోలతో రొమాన్స్ తప్పేంటి... అంటున్న ముదురు హీరోయిన్
కరీనా కపూర్‌కి ప్రస్తుతం నలభై ఏళ్లు. ఈమె అక్షయ్ లాంటి హీరోలతో సినిమా చేస్తే ఓకే. కానీ అర్జున్ కపూర్‌తో(కీ అండ్ కా), సుమీట్ వ్యాస్ (వీరే డీ వెడ్డింగ్) చిత్రాలు చేసింది. ఈ విషయంపై అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం ఇస్తూ…
“ఇటువంటి చిత్రాలు, కథలు, సన్నివేశాలు ఉండడం వెనుక రచయితలు, దర్శకులు, స్టూడియోస్, నిర్మాతలు ఉన్నారు. వారంతా ప్రస్తుతం మార్పు కోరుకున్నారు. ప్రియాంక చోప్రా తనకంటే చిన్న వయస్సు ఉన్న నిక్‌తో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. నేను, నా కంటే ఎక్కువ వయస్సు ఉన్న సైఫ్ అలీఖాన్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్నా. ఇదే ఈ దర్శక నిర్మాతలకు స్ఫూర్తి. నా వయసు వాళ్లు యువ హీరోలతో రొమాన్స్ చేయడంలో తప్పేముంది? ఈ మార్పు మంచిదే. ఈ మార్పు నా మనసులో నుంచి వచ్చింది కాదు. అది నిర్మాతలు కావాలని కోరుకున్నదే” అని చెప్పింది.
అక్షయ్ కుమార్‌తో కరీనా కపూర్ నటించిన ‘గుడ్ న్యూస్’ ఇటీవల విడుదలై బ్లాక్ బస్టర్ విజయం అందుకుంది. ప్రస్తుతం ఆమె ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఇందులో ఆమె ఆమిర్ ఖాన్‌తో కలిసి రొమాన్స్ చేయబోతున్నారు. దీంతో పాటు కరణ్ జోహార్ నిర్మిస్తున్న ‘తఖ్త్’ సినిమాలోనూ నటించనున్నారు.