'అల వైకుంఠపురములో' ఫస్ట్ డే కలెక్షన్ : షాకిచ్చిన బన్నీ....!!

Mari Sithara

ప్రస్తుతం బన్నీ, త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన తాజా సినిమా అలవైకుంఠపురములో. పూజ హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు ఎస్ ఎస్ థమన్ సంగీతాన్ని అందించగా పీఎస్ వినోద్ ఫోటోగ్రఫిని అందించాడు. గీత ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంస్థలు అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాని నిర్మించాయి. సీనియర్ నటి టబు ఒక ముఖ్య పాత్రలో నటించిన ఈ సినిమా నుండి ఇటీవల రిలీజ్ అయిన సాంగ్స్, థియేట్రికల్ ట్రైలర్ ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ సంపాదించడం జరిగింది. 

 

ఇకపోతే మొన్న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి టాక్ ని దక్కించుకుని అద్భుతమైన కలెక్షన్స్ తో షాకింగ్ రేంజ్ లో దూసుకుపోతోంది. మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా పలు కమర్షియల్ హంగులతో దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక బన్నీ యాక్షన్ అయితే సినిమాకే టోటల్ హైలైట్, అలానే సినిమాలోని కొన్ని కీలక యాక్షన్, ఎమోషన్, కామెడీ సీన్స్ అయితే ఎంతో బాగున్నాయని అంటున్నారు. ఇక మంచి టాక్ ని దక్కించుకున్న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ డే రూ.45 కోట్ల గ్రాస్, అలానే రూ.30 కోట్ల కు పైగా షేర్ ని రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా తొలిరోజు ఎంత రాబట్టిందంటే, 

 

నైజాంలో - రూ. 5 కోట్లు, 

సీడెడ్‌లో - రూ. 2.5 కోట్లు, 

ఉత్తరాంధ్రలో - రూ. 2 కోట్లు 

ఈస్ట్-వెస్ట్‌లలో కలిపి - రూ. 4.5 కోట్లు 

గుంటూరు - రూ. 3 కోట్లు, 

కృష్ణా, నెల్లూరు జిల్లాలలో దాదాపు రూ. 3 కోట్లు

 

ఇక మొత్తంగా చూసుకుంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు రూ. 20 కోట్లు కొల్లగోట్టినట్టు సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఓవర్సీస్‌లో 5 కోట్లు, కేరళ, కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో రూ. 3.5 కోట్లుపైగానే వసూలు చేసినట్టుగా చెప్తున్నారు. మొత్తానికి బన్నీ చాలా గ్యాప్ తో బాక్సాఫీస్ బరిలో నిలిచినప్పటికీ కూడా మంచి హిట్ దిశగా తన సినిమా సాగుతుండడంతో ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాడు. మరి రాబోయే రోజుల్లో ఈ సినిమా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి....!! 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: