డర్టీ హరి : మొన్న వల్గర్ గా.. నేడు ట్రెడిషన్ గా ఫస్ట్ లుక్!
సీనియర్ దర్శక నిర్మాత ఎమ్ ఎస్ రాజు తెరకెక్కిస్తున్న ‘డర్టీ హరి’ మూవీ కి సంబంధించిన ఫస్ట్ లుక్ ఈ మద్య రిలీజ్ చేశారు. ఒకప్పుడు క్లాసిక్ చిత్రాలని తెరకెక్కించిన దర్శకుడు ఎంఎస్ రాజు చాలా గ్యాప్ తర్వాత డర్టీ హరి అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. ఎం.ఎస్.రాజు అంటే ‘శత్రువు’, ‘ఒక్కడు’ ‘పౌర్ణమి’ లాంటి మూవీస్ కి నిర్మాతగా, ‘తూనీగా తూనీగా’, ‘వాన’లాంటి పూర్తి ప్రేమకథా చిత్రాలకు దర్శకుడిగా గుర్తుకు వస్తారు. ప్రస్తుతం సొసైటీలో నడుస్తున్న జనరేషన్‌కు తగ్గట్టుగా ఓ బోల్డ్, డర్టీ కథాంశంతో మూవీ రూపొందిస్తున్నాడు. తన గత సినిమాలకు భిన్నంగా బోల్డ్ కాన్సెప్ట్ తో డర్టీ హరి మూవీని ఎం ఎస్ రాజు తెరకెక్కిస్తున్నారని సమాచారం.
ఇటీవల హీరో లుక్ విడుదల చేయగా ఇందులో టైటిల్ రోల్ పోషిస్తున్న శ్రవణ్ రెడ్డి బాత్ టబ్‌లో షర్ట్ లేకుండా ఉన్నాడు. అతని నోట్లో ఓ అమ్మాయి తన కాలితో సిగరెట్ ఉంచడం.. పోస్టర్‌ను చూస్తుంటే చాలా హాట్‌గా ఉంది. ఈ మూవీకి చిత్రానికి నిర్మాతలుగా గుడూరు సతీష్ బాబు, గుడూరు సాయి పునీత్‌లు వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ మూవీలో హీరోయిన్ లుక్ రివీల్ చేశారు. రుహానీ శర్మ .. వసుదేవ అనే పాత్రలో కనిపించనుందని తెలుపుతూ ఆమె లుక్ రివీల్ చేశారు. గోల్డ్ కలర్ శారీ ధరించి ట్రెడిషనల్ లుక్ లో ఉన్న రుహని శర్మ లుక్… ఫస్ట్ లుక్ పోస్టర్ తో సంబంధం లేకుండా ఆసక్తికరంగా ఉంది.
మొత్తానికి మొన్న బాత్ రూమ్ టబ్ లో వల్గర్ గా చూపించి.. ఈ రోజు హీరోయిన్ ని ఎంతో ట్రెడిషన్ గా చూపించడం తో అసలు ఈ మూవీ ఏ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుందా అన్న ఆలోచనలో పడ్డారు ప్రేక్షకులు. ఈ సినిమాను ఎస్పీజే క్రియేషన్స్ బ్యానర్‌పై గూడూరు శివరామకృష్ణ సమర్పణలో గూడూరు సతీష్ బాబు, గూడూరు సాయి పునీత్‌లు నిర్మిస్తున్నారు.