ప్రియుడు విఘ్నేష్ శివన్ నుండి విడిపోయిన నయనతార..... ??
మొదట చంద్ర ముఖి సినిమాతో కోలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన నయనతార, అంతకముందు అక్కడక్కడా కొన్ని మలయాళ సినిమాల్లో చిన్న పాత్రల్లో నటించింది. అయితే చంద్రముఖి ద్వారా ఏకంగా సూపర్ స్టార్ రజిని సరసన అవకాశము లభించడం, అలానే అప్పట్లో ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ కొట్టడంతో నయనతారకు నటిగా మంచి పేరు లభించింది. ఆ తరువాత గజినీ, తెలుగులో లక్ష్మి, యోగి సినిమాల్లో నటించి మంచి పేరు దక్కించుకుంది నయనతార. ఇక అక్కడి నుండి వరుసగా పలువురు టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోల సరసన నటిస్తూ మంచి సక్సెస్ లు అందుకుంటూ ముందుకు సాగిన నయనతార, అనతికాలంలోనే స్టార్ హీరోయిన్ గా పేరు గడించింది.
కెరీర్ మొదట్లో హీరో శింబు తో కొంత ప్రేమాయణం నడిపిన నయనతార, ఆ తరువాత నటుడు, డ్యాన్సరైన ప్రభుదేవాను ప్రేమించింది. అయితే అప్పట్లో ప్రభుదేవా మొదటి భార్య వారిద్దరి ప్రేమపై కోర్ట్ కి ఎక్కడంతో దానిని అంతటితో ఆపేసింది నయన్. ఇక ఇటీవల నేను రౌడీనే అనే సినిమాలో నటించిన నయనతార, ఆ సినిమా దర్శకుడైన విఘ్నేష్ శివన్ తో ప్రేమలో పడింది. కొన్నాళ్లుగా చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్న వీరిద్దరూ, తమ మధ్య ప్రేమ ఉందని బహిరంగంగా చెప్పనప్పటికీ, పరోక్షంగా మాత్రం కొన్ని ఫోటోలు పోస్ట్ చేయడం, సోషల్ మీడియా మాధ్యమాల్లో ట్వీట్స్ వంటివి చేయడం చేసారు.
3అయితే నేడు కొన్ని కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం,
ఇటీవల నయనతార, విఘ్నేష్ ల మధ్య కొద్దిపాటి వివాదం జరిగి వారిద్దరూ విడిపోయినట్లు వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఇంకెన్నాళ్లు ప్రేమించుకుంటాం, ఇకనైనా పెళ్లి చేసుకుందాం అని విఘ్నేష్ శివన్ అడగడంతో, తనకు కెరీర్ లో ఇంకా స్థిరపడాలని ఉందని, కావున ఇప్పుడే పెళ్లి చేసుకోలేనని నయనతార చెప్పడంతో, కొంత హర్ట్ అయిన విఘ్నేష్, కొద్దికాలంగా ఆమెకు దూరంగా ఉంటున్నట్లు చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తపై వారిద్దరిలో ఎవరో ఒకరు స్పందిస్తేనేగాని అసలు వాస్తవాలు వెల్లడికావని అంటున్నారు సినీ విశ్లేషకులు.......!!