మాస్ మహారాజ్ రవితేజ ,ఎక్కడికిపోతావు చిన్నవాడా ఫేమ్ వి ఐ ఆనంద్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం 'డిస్కోరాజా'. ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యకమ్రాలను పూర్తి చేసుకుంటుంది. అందులో భాగంగా రవితేజ తాజాగా ఈ సినిమాలోని తన పాత్ర తాలూకు డబ్బింగ్ పూర్తి చేశాడు. ఇక ఇటీవల విడుదలైన ఈ చిత్రం యొక్క టీజర్ సూపర్ రెస్పాన్స్ ను రాబట్టగా వచ్చే వారంలో టీజర్ 2 కూడా విడుదలకానుంది. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 18న గ్రాండ్ గా జరుపనున్నారు. అయితే ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎవరు రానున్నారో తెలియాల్సి వుంది.
సైన్టిఫిక్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాభా నటేష్ , రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">పాయల్ రాజ్ పుత్ , తాన్యా హాప్ కథానాయికలుగా నటిస్తుండగా ఎస్ ఆర్ టి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రవి తాళ్లూరి నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక గత ఏడాది టచ్ చేసి చూడు , నేల టిక్కెట్టు , అమర్ అక్బర్ ఆంటొని రూపంలో మూడు భారీ డిజాస్టర్లను చవిచూసిన రవితేజ, డిస్కోరాజా పై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
ఇదిలావుంటే రవితేజ ప్రస్తుతం గోపిచంద్ మలినేని తో క్రాక్ అనే సినిమా చేస్తున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈచిత్రంలో రవితేజ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా ఠాగూర్ మధు నిర్మిస్తున్నాడు. సమ్మర్ లో ఈ చిత్రం ప్రేక్షకులముందుకు రానుంది. కాగా రవితేజ -గోపిచంద్ కాంబినేషన్ లో ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కలయికలో డాన్ శీను, బలుపు తెరకెక్కాయి.