హెరాల్డ్ 2019 సింహావ‌లోక‌నం: టాప్ 3 మూవీస్ కోలీవుడ్‌..!

praveen

కోలీవుడ్ ఇండస్ట్రీలో 2019 సంవత్సరంలో ఎన్నో సినిమాలు విడుదలయ్యాయి. బాక్సాఫీస్ వద్ద ఎన్నో  సినిమాలు సంచలన విజయాన్ని నమోదు చేశాయి. బడా హీరోల నుంచి చిన్న హీరోల వరకు ఎన్నో సినిమాలు బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించాయి. మరి కొన్ని సినిమాలైతే ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా భారీ వసూళ్లను రాబట్టాయి . ఇకపోతే 2019 సంవత్సరం ఈ రోజుతో ముగియనుంది. మరి  2019 సంవత్సరంలో విడుదలైన సినిమాలన్నింటిలో టాప్ ప్లేస్ లో ఏవి ఉన్నాయో ఇప్పుడు చూద్దాం. 

 

 

 

విశ్వాసం : 2019 సంవత్సరం ప్రారంభంలోనే జనవరి 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విశ్వాసం సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. ఒక కాలీవుడ్ లోనే కాకుండా ప్రతి ఇండస్ట్రీలో మంచి విజయాన్ని అందుకుంది విశ్వాసం సినిమా. తమిళ స్టార్ హీరో అజిత్ నటించిన ఈ సినిమాను దర్శకుడు శివ తెరకెక్కించారు. ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో ఆదరణ పొంది బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించింది. కూతురిపై తండ్రి ప్రేమ ఎలా ఉంటుంది అనే దానిపై ఈ సినిమా తెరకెక్కింది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకర్షిస్తు భారీ వసూళ్లను సాధించింది. ఏకంగా రెండు వందల కోట్లు వసూళ్లు రాబట్టింది అజిత్ విశ్వాసం సినిమా. 

 

 

 

 పెటా : సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పేట. ఈ సినిమాలో రజనీకాంత్ సరికొత్త లుక్తో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాడు. రజినీకాంత్ స్టైల్  రజినీకాంత్ యాక్షన్ తో ప్రేక్షకులను కట్టిపడేసి ఓ బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు రజనీకాంత్. ఈ సినిమా టాలీవుడ్ లోనే కాకుండా మిగతా ఇండస్ట్రీలలో కూడా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమాలో రజనీకాంత్ స్టైల్ కి ఫిదా అయిపోయారు ప్రేక్షకులు. ఇక ఈ సినిమాకి అద్భుతమైన మ్యూజిక్ అందించారు సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్. తన స్వరాలతో ప్రేక్షకులందరినీ ఉర్రూతలూగించాడు. ఈ సినిమా ఏకంగా 250 కోట్ల వరకు వసూలు రాబట్టింది.

 

 

 

బిగిల్ : కన్నడ స్టార్ హీరో విజయ్ హీరోగా నటించిన బిజిల్  సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చే సంచలన విజయాన్ని నమోదు చేసింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి నిర్మాతలకు భారీ లాభాలు తెచ్చి పెట్టింది ఈ సినిమా. తమిళ కన్నడ ప్రేక్షకులతో పాటు తెలుగు హిందీ ప్రేక్షకులను కూడా ఎంతగానో అలరించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఈ సినిమా. 140 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా భారీ వసూళ్లు రాబట్టింది. కాగా ఈ సినిమాకి ఏ.ఆర్.రెహమాన్ స్వరాలను సమకూర్చారు. మ్యూజిక్ పరంగా కూడా ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఏకంగా బాక్సాఫీస్ వద్ద రెండు వందల కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది  హీరో విజయ్ నటించిన ఈ చిత్రం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: