తదుపరి సినిమా ప్రకటించకపోతే సూసైడ్ చేసుకుంటా....అభిమాని సంచలన ట్వీట్....!!

Mari Sithara

సినిమా హీరోలంటే మన దేశంలో ఎంతిదిగా ఆరాధిస్తారో మనకు తెలిసిందే. నిజంగా ప్రతి ఏడాది వచ్చే పండుగలని హీరోల అభిమానులు ఎలా జరుపుకుంటారో తెలియదుగాని, అదే వారి అభిమాన హీరో సినిమా రిలీజ్ అవుతోంది అంటే చాలు వారి ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు, ఇక ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తున్నప్పుడు వారు పొందే ఆనందం వర్ణనాతీతం. మన ఇండియాలోనే నటులను ఈ విధంగా ఆరాధిస్తారు. ఇకపోతే అసలు మ్యాటర్ ఏంటంటే, బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ కొద్దిరోజుల నుండి సరైన సక్సెస్ లేక కెరీర్ పరంగా ఎంతో ఇబ్బందిపడుతున్నారు. 

 

వాస్తవానికి పలువురు దర్శకులు ఆయనతో సినిమా చేయడానికి ముందుకు వస్తున్నప్పటికీ కూడా తన కెరీర్ కి మంచి బూస్ట్ ఇచ్చే స్టోరీ కోసం షారుఖ్ ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఆయన నటించిన రాయిస్, జబ్ హ్యారీ మేట సెజల్, జీరో సినిమాల్లో నటించిన షారుఖ్, అవి ఆశించిన రేంజ్ లో సక్సెస్ కాకపోవడంతో, ప్రస్తుతం ఎంతో ఆలోచనలో చేస్తూ, తన తదుపరి సినిమాని కొంత గ్యాప్ తీసుకున్నాకే ప్రకటిద్దాం అని సిద్ధం అయ్యారట. 

 

అయితే షారుఖ్ మరొక రెండు రోజుల్లో రాబోయే నూతన సంవత్సరం సమయంలో తన తదుపరి సినిమాని కనుక ప్రకటించకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఒక షారుఖ్ అభిమాని, సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. అయితే దానిపై స్పందించిన కొందరు నెటిజట్లు, నువ్వు షారుఖ్ ని నిజంగా ఇష్టపడే అభిమానివే అయితే, ముందుగా నీ కుటుంబం గురించి కూడా ఆలోచించు. అంతేకాని ఆయన సినిమా ప్రకటించడం లేదని సూసైడ్ వంటి చేసుకుంటాను అంటూ బెదిరింపులకు దిగడం సరైనది కాదని అతడిపై మండిపడుతూ రీట్వీట్స్ చేస్తున్నారు. కాగా ఈ న్యూస్ ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో ఎంతో వైరల్ అవుతోంది........!!  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: