తమిళ స్థార్ హీరో విజయ్ ప్రస్తుతం తన 64 వ చిత్రంలో నటిస్తున్నాడు. ఖైదీ ఫేమ్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం యొక్క షూటింగ్ కర్ణాటక లోని శివమొగ్గ జైలు లో జరుగుతుంది. మచ్ అవైటెడ్ మూవీగా వస్తున్న ఈ చిత్రంలో మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా పేట ఫేమ్ మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తుంది. వీరితో పాటు ఆండ్రియా జెర్మియా ,శంతన్ భాగ్యరాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్ లో విజయ్ , విజయ్ సేతుపతి , ఆండ్రియా పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. ఈచిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ చెన్నై లో జరగనుంది. ఇక న్యూ ఇయర్ కానుకగా ఈ చిత్రం నుండి డిసెంబర్ 31న సాయంత్రం 5గంటలకు ఫస్ట్ లుక్ విడుదలకానుంది.
ఈచిత్రం యొక్క శాటిలైట్ హక్కులను సన్ టీవి సొంతం చేసుకోగా ఆడియో రైట్స్ ను సోనీ మ్యూజిక్ దక్కించుకుంది. అలాగే డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ చేజిక్కించుకుంది. ఈమొత్తం డీల్ విలువ 52కోట్లు ఉంటుందని సమాచారం. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈచిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తుండగా భారీ బడ్జెట్ తో ఎక్స్ బి ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.
ఇక ఇటీవల విజయ్ నటించిన సర్కార్ , బిగిల్ చిత్రాలు తమిళ్ తోపాటు తెలుగులోనూ సూపర్ హిట్ కావడం అలాగే లోకేష్ కనకరాజ్ , ఖైదీ తో మంచి గుర్తింపు తెచ్చుకోవడం తో ఈ చిత్రంపై తెలుగులో కూడా అంచనాలు వున్నాయి. మరి ఈ చిత్రం యొక్క తెలుగు హక్కులను ఎవరు దక్కించుకుంటారో చూడాలి. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రం తమిళ్‌తోపాటు తెలుగులోనూ ఒకేసారి విడుదలకానుంది.