డైరెక్టర్ గర్ల్ ఫ్రెండ్ ని పటాయించి మరి ఆ ఛాన్స్ కొట్టేసా : సల్మాన్ ఖాన్

praveen

బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కి ఎంత ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సల్మాన్ ఖాన్ ని చూస్తే చాలు అభిమానులు పూనకంతో ఊగి పోయింది ఫోటోల కోసం ఎగబడుతుంటారు. సల్మాన్ ఖాన్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తూ ఉంటాయి. బాలీవుడ్ హీరోలందరితో సల్మాన్ ఖాన్ కు ఒక ప్రత్యేకమైన ఉంటుంది. అయితే ప్రస్తుతం సిక్స్ ప్యాక్ తో  కండల వీరుడిగా అందరిని  అలరిస్తున్న సల్మాన్ ఖాన్.. సినిమా ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో సెక్సీగా చాక్లేట్ బాయ్ లా ఉండే వాడు . దీంతో సల్మాన్ ఖాన్ చూపులకు పడిపోయిన అమ్మాయిలు ఎంతోమంది. అప్పట్లో అందరూ సల్మాన్ జపం చేసేవారు. సల్మాన్ ఖాన్ కి ఇప్పటికీ అమ్మాయిల్లో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. 

 

 

 అయితే తాజాగా సల్మాన్ ఖాన్ ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు. తాను ఒక డైరెక్టర్ లవర్ ను  పడేయడం ద్వారా తనకు ఒక ఛాన్స్ వచ్చిందని చెప్పుకొచ్చాడు సల్మాన్ ఖాన్. ఓ సమయంలో సీ  రాక్  క్లబ్లో స్విమ్మింగ్ పూల్ లో తాను స్విమ్మింగ్ చేస్తున్న సమయంలో... స్విమ్మింగ్ పూల్ దగ్గరికి ఎర్ర రంగు చీర కట్టుకున్న ఓ అందమైన అమ్మాయి వచ్చిందని సల్మాన్ ఖాన్ తెలిపాడు. ఆమెను పటయించడానికి నీటి లోపలి కి వెళ్లి పోయి  స్విమ్మింగ్ చేసాడట సల్మాన్ ఖాన్ చేశాడట. కానీ సల్మాన్  నీటి నుంచి బయటకు వచ్చేసరికి ఆమె అక్కడ లేదట. ఆ తర్వాత మరుసటి రోజు తనకు ఓ దర్శకుడు నుండి   నుంచి పిలుపు వచ్చిందని సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. కూల్ డ్రింక్ యాడ్ లో నటించాలని తనకు  ఫార్ ప్రొడక్షన్స్ అనే సంస్థ ఆఫర్ ఇచ్చిందని... తాను యాక్ట్ చేసిన తొలి ప్రకటన అదే  అంటు  సల్మాన్ ఖాన్ చెప్పుకొచ్చాడు. 

 

 

 

 అయితే తనకు ఈ ఆఫర్ ఎలా వచ్చింది అనే అనుమానంతో డైరెక్టర్ దగ్గరకు వెళ్లి నన్ను ఎలా కాంటాక్ట్ చేశారు అని అడుగగా... నిన్న స్విమ్మింగ్ పూల్ దగ్గర నువ్వు అండర్ వాటర్ లో స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు అక్కడికి ఎర్ర చీర కట్టుకొని వచ్చిన అమ్మాయి తన గర్ల్ ఫ్రెండ్ అని దర్శకుడు చెప్పాడట. అలా తాను తొలిసారి కెమెరా ముందుకు వచ్చానని చెప్పుకొచ్చాడు బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఇకపోతే తాజాగా ప్రభుదేవా దర్శకత్వంలో తెరకెక్కిన దబాంగ్ 3 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు సల్మాన్ ఖాన్ . ఈ సినిమాలో సోనాక్షి సిన్హా, సయు మంజ్రేకర్  కథానాయకులుగా నటించారు. కాగా ఈ సినిమాలో మరోసారి తన సిక్స్ ప్యాక్ తో అందరి మతిపోగొట్టాడు  బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: