'సరిలేరు నీకెవ్వరు' నుండి ఈసారి రాబోయే సాంగ్ అదా....??
ప్రస్తుతం మహేష్ నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు పై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో సైతం విపరీతమైన అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. యంగ్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుండగా సీనియర్ నటి విజయశాంతి చాలా గ్యాప్ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీత సారథ్యంలోని మూడు సాంగ్స్ ఇప్పటికే యూట్యూబ్ లో రిలీజ్ అయి, అత్యధిక వ్యూస్ మరియు లైక్స్ తో దూసుకుపోవడం జరిగింది.
అలానే వాటితో పాటు రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ టీజర్ కు కూడా విశేషమైన స్పందన లభించినడంతో పాటు సినిమాపై అంచనాలు కూడా మరింత పెంచింది. ఇకపోతే ఈ సినిమాలోని నాలుగవ సాంగ్ ని రాబోయే సోమవారం ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది సినిమా యూనిట్. సైనికుల పై రాయబడిన ఈ పవర్ఫుల్ సాంగ్, సినిమాలో ప్రథమార్ధం లో వస్తుందట. ఇటీవల ఈ సాంగ్ తాలూకు బిట్ కొద్దిరోజల క్రితం స్వతంత్ర దినోత్సవం సందర్భంగా సినిమా యూనిట్ యూట్యూబ్ లో రిలీజ్ చేయడం జరిగింది.
కాగా ఈ సాంగ్ ని మన దేశ సైనికులకు అంకితం ఇవ్వనున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ మహేష్ బాబు తొలిసారి తన కెరీర్ లో మిలిటరీ మేజర్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, మురళి శర్మ, సంగీత, సుబ్బరాజు, వెన్నెల కిషోర్, శ్రీనివాస రెడ్డి, బండ్ల గణేష్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే రెండు వరుస విజయాలతో దూసుకుపోతున్న సూపర్ స్టార్, తప్పకుండా ఈ సినిమాతో కెరీర్ లో హ్యాట్రిక్ విజయాలు అందుకుంటారని ఆయన ఫ్యాన్స్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.....!!