రూలర్ : బాలయ్యకు సోనాల్ మీద, ప్రేమ వేదిక మీద లేదే...!
ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ మరియు కేఎస్ రవికుమార్ ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా రూలర్. సోనాల్ చౌహన్ మరియు వేదిక హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాను ప్రముఖ నిర్మాత సి కళ్యాణ్ నిర్మిస్తుండగా రామ్ ప్రసాద్ ఫోటోగ్రఫిని అందిస్తున్నారు. ఇక చిరంతన్ భట్ సంగీత సారద్యంలో రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన రెండు సాంగ్స్ ఇప్పటికే శ్రోతలను విశేషంగా అలరించడంతో పాటు సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ చేయడం జరిగింది. ఇటీవల ఎన్టీఆర్ బయోపిక్ సినిమాలైన కథానాయకుడు, మహానాయకుడు సినిమాల్లో నటించిన బాలకృష్ణ,
అవి బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్ కావడంతో కొంత ఆలోచన చేసి, చివరికి గత ఏడాది తనకు జేసింహా వంటి హిట్ మూవీని అందించిన కేఎస్ రవికుమార్ కు ఈ సినిమా ద్వారా మరొకసారి దర్శకుడిగా ఛాన్స్ ఇచ్చారు. ఇకపోతే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక నిన్న రాత్రి విశాఖపట్నంలో ఎంతో వేడుకగా జరిగింది. సినిమా యూనిట్ సభ్యులతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ వేడుకలో నందమూరి బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడుతూ, తనకు జైసింహా సినిమా చేస్తున్నపుడు కేఎస్ రవికుమార్ గారి దర్శకత్వ స్టయిల్ ఎంతో నచ్చిందని, ఆయనతో మరొక సినిమా చేయాలని భావిస్తున్న అదే సమయంలో పరుచూరి మురళి గారు ఒక అద్భుతమైన కథను తీసుకురాగా, దానికి దర్శకుడిగా రవికుమార్ గారు అయితే కరెక్ట్ అని భివించి ఆయనను పిలిపించి మాట్లాడడం జరిగిందని,
ఆ విధంగా ఈ సినిమాకు పునాది పడిందని అన్నారు బాలకృష్ణ. ఇక సినిమాలోని ఇతర నటులు మరియు సాంకేతిక నిపుణులు అందరి గురించి మాట్లాడిన బాలకృష్ణ, తన ప్రక్కన హీరోయిన్స్ గా నటించిన ఇద్దరు హీరోయిన్లు ఎంతో అద్భుతంగా నటించారని, అలానే గతంలో తనతో లెజెండ్ సినిమాలో నటించిన సోనాల్ మరొక్కసారి ఈ సినిమాలో మంచి పాత్ర చేస్తోందని చెప్పడం జరిగింది. అయితే మరొక హీరోయిన్ వేదిక గురించి మాత్రం బాలకృష్ణ ఒక్క మాట కూడా చెప్పలేదు. కాగా, ఆయన కావాలనే వేదిక గురించి చెప్పలేదా, లేక మరిచిపోయారా అనేది తెలియదు గాని, ప్రస్తుతం ఈ మ్యాట ర్ పై పలు టాలీవుడ్ వర్గాల్లో కొంత చర్చ జరుగుతోంది.....!!