అక్కినేని అభిమానులు మరియు దగ్గుబాటి అభిమానులు ఏ రోజుకోసమైతే ఎదురుచూసారో ఆ రోజు రానే వచ్చింది. విక్టరీ వెంకటేశ్ , యువ సామ్రాట్ నాగ చైతన్య కలిసి నటించిన లేటెస్ట్ మూవీ వెంకీ మామ. నిజ జీవితంలో మామ -అల్లుళ్లు అయిన వెంకీ, చైతన్య ఈచిత్రం లో కూడా అవే పాత్రల్లో కనిపించనుండడంతో మొదటి నుండి సినిమా పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఈ రోజు విడుదలైన ఈ చిత్రం క్రిటిక్స్ దగ్గర నుండి మిక్సడ్ రివ్యూస్ ను సొంతం చేసుకుంది. అయితే టాక్ బాగుండడం తో ఈ చిత్రం మొదటి రోజు అదిరిపోయే ఓపెనింగ్ ను రాబట్టుకోనుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మ్యాట్నీ షోస్ నుండే హౌస్ ఫుల్ బోర్డులు పడడం తో మొదటి రోజు ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 8-9 కోట్ల షేర్ ను రాబట్టుకునే అవకాశం వుంది. దాంతో ఈ చిత్రం అటు వెంకటేశ్ అలాగే నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ సినిమా గా రికార్డు సృష్టించనుంది. పూర్తి కమర్షియల్ ప్యాకేజీ తో బాబీ తెరకెక్కించిన ఈ చిత్రంలో స్టోరీ అంత గొప్పగా లేకపోయిన వెంకీ -చైతన్య ల కెమిస్ట్రీ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.
ఇక ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 32కోట్ల ప్రీ రిలీజ్ చేయగా మొదటిరోజే అందులో 1/4 వంతు వసూళ్లను రాబట్టుకుందని సమాచారం. సోలో విడుదల కావడం తో వచ్చే శుక్రవారం వరకు ఈ చిత్రానికి బాక్సాఫీస్ వద్ద పోటీలేకపోవడం కూడా కలిసి రానుంది. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో వెంకీ సరసన హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ నటించగా నాగ చైతన్య కు జోడిగా రాశీ ఖన్నానటించింది. సురేష్ ప్రొడక్షన్స్ , పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ల పై సురేష్ బాబు , టిజి విశ్వప్రసాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.