మొన్నటి వరకు సాంగ్స్ తో యూ ట్యూబ్ లో పలు రికార్డులు సృష్టించిన అల వైకుంఠపురములో తాజాగా టీజర్ తో ఆల్ టైం రికార్డు సృష్టించింది. నిన్న విడుదలైన ఈచిత్రం యొక్క టీజర్ తక్కువ సమయంలో 5మిలియన్ల రియల్ టైం వ్యూస్ ను రాబట్టి సరికొత్త రికార్డు సృష్టించింది. అంతేకాదు కేవలం విడుదలైన 7నిమిషాల్లోనే 1మిలియన్ రియల్ టైం వ్యూస్ ను రాబట్టి అదుర్స్ అనిపించింది. ఇంతకుముందు మహేష్ బాబు, సరిలేరు నీకెవ్వరు టీజర్ 9నిమిషాల్లో ఈఫీట్ సాధించగా తాజాగా అల.. వైకుంఠపురములో ఆ రికార్డు ను బద్దలు కొట్టింది.
ఇక త్రివిక్రమ్ మార్క్ తో కూడిన ఈ టీజర్ పాజిటివ్ రెస్పాన్స్ ను తెచ్చుకుంటుంది. అల్లు అర్జున్ స్టైలిష్ స్క్రీన్ ప్రెజెన్స్ , డైలాగ్స్ , తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ టీజర్ లో హైలెట్ అయ్యాయి. పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో బన్ని కి జోడిగా పూజా హెగ్డే నటిస్తుండగా టబు, జయరాం , మురళీ శర్మ , సునీల్ ,నవదీప్ , సుశాంత్ , నివేత పేతురాజు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్ , హారిక హాసిని క్రియేషన్స్ బ్యానర్ల పై అల్లు అరవింద్ ,రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదలకానుంది.
దాదాపు రెండేళ్ల గ్యాప్ తరువాత అల్లు అర్జున్ ఈ సినిమా తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. దాంతో ఈ చిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా ఈ సినిమాకు పోటీగా అదే రోజు సరిలేరు నీకెవ్వరు కూడా విడుదలవుతుండడంతో ఈసంక్రాంతికి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికర పోరు జరుగనుంది. మరి ఈ పోరు లో ఎవరిది పై చేయి అవుతుందో చూడాలి.