టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ఇష్టం అనే సినిమా ద్వారా హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నటి శ్రియా శరణ్, ఆ తర్వాత నాగ్ సరసన సంతోషం సినిమాలో నటించి మంచి సక్సెస్ అందుకుంది. ఇక అక్కడినుండి శ్రియ ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ పలువురు స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరుతో ముందుకు సాగింది. ఇక ఇటీవల వివాహానంతరం, ఆమె చాలావరకు తగ్గించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన ఒక వార్త పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతుంది. అదేమిటంటే రెండు రోజుల క్రితం ఒక కార్పొరేట్ సంస్థకు సంబంధించి వ్యాపార ప్రకటన నిమిత్తం హీరోయిన్ శ్రియ పై ఒక యాడ్ చిత్రీకరించాలని భావించి,
ఆ సంస్థ వారు తమకు తెలిసిన ఒక జర్నలిస్టును సంప్రదించడం జరిగిందట. అయితే అదే అదనుగా భావించిన అతడు, తనకు శ్రీ శ్రియ గారి పీఏ తెలుసునని, ఆమెను పిలిపించి ఒకరోజు మీతో మాట్లాడిస్తానని చెప్పాడట. ఇక అనుకున్న ప్లాన్ ప్రకారం, తనకు తెలిసిన ఒక అమ్మాయిని తీసుకొని వచ్చి ఈమె శ్రియ గారి పీఏ అంటూ మోసం చేసి ఒప్పించడం జరిగిందట. ఆమె నిజంగానే శ్రియ గారికి పీఏ అని భావించిన సదరు సంస్థ మేనేజర్, తమ వ్యాపార ప్రకటనల నిమిత్తం రూ.5 లక్షల అడ్వాన్స్ రూపేణ ఆమెకు ఇవ్వడం జరిగిందట. అయితే ఆ తర్వాత నుండి ఎన్నిసార్లు ఫోన్ చేసినా పీఏ మరియు జర్నలిస్టు ఇద్దరి ఫోన్లు స్విచాఫ్ వస్తుండడంతో, కొంత అనుమానం వచ్చి ఈ విషయమై సమీప పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారట సంస్థ మేనేజర్.
కాగా ఈ విషయమై పూర్తి వివరాలు విచారించి బయటపెడతామని పోలీసులు హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విధంగా కొందరు దుండగులు హీరో, హీరోయిన్ల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడుతున్నారని, కాబట్టి ఇటువంటి మోసాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం మొత్తం హీరోయిన్ శ్రియా వద్దకు చేరిందని సమాచారం. మరి ఆమె ఈ విషయంలో ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం ఈ మ్యాటర్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతోంది....!!