సోషల్ మీడియాలో రాహుల్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన పునర్నవి..!
అయితే రాహుల్ ఎదుర్కొన్న ఇంటర్వ్యూలలో చాలావరకు పునర్నవిని ప్రస్తావిస్తూ అతనికి ఎన్నో ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆమె ఫ్రెండ్ కంటే ఎక్కువ అని రాహుల్ సమాధానం ఇస్తూ వచ్చాడు. ఇకపోతే ఇటీవల బిగ్ బాస్ కంటెస్టెంట్స్ రీ యూనియన్ అంటూ పార్టీలతో తెగ సందడి చేశారు. ముఖ్యంగా పునర్నవి ప్రతిపార్టీలో అటెండ్ అవుతూ వచ్చింది. కానీ రీసెంట్ గా పునర్నవి సమక్షంలో జరిగిన పార్టీలో రాహుల్ కనిపించలేదు. దీంతో సోషల్ మీడియా ద్వారా ఆమె మిస్ యూ రాహుల్ అని కామెంట్ చేయడం వైరల్ గా మారింది.
పునర్నవి ఆ కామెంట్ మామూలుగానే అన్నప్పటికీ ముందు నుంచి ఉన్న పుకార్లకు ఈ కామెంట్ కాస్త బూస్ట్ ఇచ్చిందనే చెప్పాలి. రాహుల్ కూడా ఆమెతో మంచి రిలేషన్ ఉందని చెప్పడంతో కొన్ని మీడియాల్లో డేటింగ్ కథనాలు ప్రసారం చేస్తున్నారు. అయితే పునర్నవి మాత్రం రాహుల్ పై పెద్దగా కామెంట్ చేయడానికి ఇష్టపడటం లేదు. ఇకపోతే మరోపక్క వీరిద్దరి రిలేషన్ గురించి కథలు కథలు కొన్ని కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి.