నిర్మాతలకు షాక్ ల మీద షాక్ లు ఇస్తున్న అల్లు అర్జున్..?
ఈ క్రమంలో ప్రస్తుతం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో చేస్తున్న అలా వైకుంఠపురం సినిమా విషయంలో ఇటువంటి ఒప్పందం చేసుకుని హారిక హాసిని సంస్థ తో ఒప్పించి గీతాఆర్ట్స్ కి వాటా వచ్చేలా అల్లు అర్జున్ ముందే అగ్రిమెంట్ చేసుకున్నట్లు సమాచారం. ఇటువంటి నేపథ్యంలో త్రివిక్రమ్ తో చేస్తున్న సినిమా చివరి దశకు చేరుకున్న ఈ క్రమంలో తర్వాత సుకుమార్ తో చేయబోయే సినిమా నీ నిర్మిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థకి కూడా ఇలాంటి షరతే పెట్టాడు బన్నీ.
ఇందులో గీతాఆర్ట్స్ కి భాగస్వామ్యం ఇవ్వాలని అల్లు అర్జున్ కండీషన్ ఎక్కడంతో నిర్మాతలు ఒక్కసారిగా షాక్ తిన్నారట. అసలే మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణ సంస్థ ఇటీవల నిర్మిస్తున్న సినిమాలు వరుసగా నష్టాలు తీసుకు వస్తున్న క్రమంలో..తాజాగా అల్లు అర్జున్ పెట్టిన కండిషన్ కి ఒక్కసారిగా షాక్ తిన్నట్లు..సమాచారం. మరి ఈ విషయంలో మైత్రి మూవీ మేకర్స్ ఏ విధంగా ముందుకు వెళ్తుందో చూడాలి. మరోపక్క అల్లు అర్జున్ మాత్రం తన తర్వాత చేయబోయే సినిమాల విషయంలో ఇదే పంథా కొనసాగించాలని డిసైడ్ అయినట్లు ఫిలింనగర్ లో వార్తలు వినపడుతున్నాయి.