'సామజవరగమన' సాంగ్ కోసం స్పెషల్ గా ఆ దేశం వెళ్లిన ‘అలా వైకుంఠపురంలో’ సినిమా యూనిట్!
ఇటీవలి కాలంలో ఇంత వేగంగా అంతర్జాలంలోకి దూసుకెళ్లిన వేరొక పాట లేనే లేదు. ఎస్.ఎస్.థమన్ బ్రాండ్ మ్యూజిక్ అద్భుతంగా వర్కవుటైంది. దీంతో సినిమా యూనిట్ ఈ సాంగు చిత్రీకరణ పై స్పెషల్ ఫోకస్ పెట్టారట. సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో మామూలుగా కాని చేద్దామని అనుకున్న సినిమా యూనిట్ సామజవరగమనా పాట వీడియో చిత్రీకరణ కోసం స్పెషల్ గా ప్యారిస్ షెడ్యూల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారట. ప్రస్తుతం ఈ పాటకి సంబంధించిన సాంగ్ షూటింగ్ ప్యారిస్‌లో జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ సాంగులో మోస్ట్ స్టైలిష్ గా తనని తాను ఆవిష్కరించుకునేందుకు బన్ని స్పెషల్ కాస్ట్యూమ్స్ ని ఎంపిక చేసుకున్నాడు.
అందుకోసం ప్యారిస్ లో ప్రఖ్యాత మాల్ కి వెళ్లి కాస్ట్యూమ్స్ ని కొనుక్కున్నారని.. పూజా కాస్ట్యూమ్స్ అంతే ప్రత్యేకంగా సెలెక్ట్ చేసుకున్నారని ప్రచారమైంది. ఇటువంటి నేపథ్యంలో తాజాగా సామజ వర గమన పాట కి సంబంధించిన పోస్టర్ ని సినిమా యూనిట్ ఇటీవల విడుదల చేయడంతో సోషల్ మీడియాలో విడుదలైన పిక్ వైరల్ అవుతుంది. విడుదలైన ఫోటో లో అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా వైట్ అండ్ వైట్ డ్రెస్ లో అదిరిపోయే స్టైలిష్ మూమెంట్ డాన్స్ తో దర్శనం ఇస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది.