గ్యాప్ ఇవ్వలేదు వచ్చింది: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ బర్త్ డే స్పెషల్ : 10 బెస్ట్ డైలాగ్స్ మీకోసం

Prasad Deepak
ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ అదేనండీ మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పుట్టినరోజు నేడు(నవంబర్ 7). తన మాటలతో జాదూ చేసే త్రివిక్రమ్ శ్రీనివాస్ నవంబర్ 7, 1971 లో జన్మించారు. భీమవరంలో అతి సామాన్య కుటుంబంలో జన్మించిన ఆకెళ్ళ నాగ శ్రీనివాస శర్మ బాల్యం నుండి చాలా తెలివిగల వాడు. త్రివిక్రమ్ చదువు ను ఎప్పుడు నిర్లక్ష్యం చెయ్యలేదు,  త్రివిక్రమ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో మాస్టర్ డిగ్రీ చేసాడు. యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించాడు. 


మహేష్ బాబు తో త్రివిక్రమ్ తీసిన 'అతడు' సినిమా ద్వారా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఒక్కో సినిమాతో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఈరోజు అగ్ర దర్శకుడిగా నీరాజనాలు అందుకుంటున్నాడు. ఈరోజు త్రివిక్రమ్ శ్రీనివాస్ అగ్ర దర్శకుడైనా, ప్రేక్షకులు మాత్రం మొదట త్రివిక్రమ్ అనగానే గుర్తు తెచ్చుకునేది ఆతని మాటలనే. ఏదైనా విషయాన్ని స్పష్టంగా ఎదుటివారికి అర్ధమయ్యే రీతిలో ఆసక్తికరంగా చెప్పగల మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్.
ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్త్ డే స్పెషల్ గా ఒక 10 బెస్ట్ డైలాగ్స్ మీకోసం 


1. పని చేసి జీతం అడగొచ్చు, అప్పు చేసి వడ్డీ అడగొచ్చు, కానీ హెల్ప్ చేసి థాంక్స్ అడగకూడదు.
2. తండ్రికి, భవిష్యత్తుకి భయపడనివాడు జీవితంలో పైకి రాడు.
3. అదృష్టం ఒకేసారి తలుపు తడుతుంది, కానీ దురదృష్టం తలుపు తీసేవరకూ తడుతూనే ఉంటుంది.
4. ఒక మనిషిని మనం ప్రేమిస్తే వాళ్ళు చేసే తప్పుని కూడా క్షమించగలగాలి.
5. నిజం చెప్పకపోవడం అబద్ధం, అబద్ధాన్ని నిజం చేయాలనుకోవడం మోసం.
6. మనకు వస్తే కష్టం, మనకు కావాల్సిన వాళ్లకు వస్తే నరకం.
7. వాడిదైన రోజున ఎవడైనా కొట్టగలడు, అసలు గొడవ రాకుండా ఆపుతాడు చూడు వాడు గొప్పోడు.
8. యుద్ధంలో గెలవడం అంటే శత్రువుని చంపడం కాదు ఓడించడం.
9. సంపాదించడం చేతకాని వాడికి ఖర్చుపెట్టే అర్హత లేదు.
10. అందంగా ఉండటం అంటే మనకు నచ్చినట్టు ఉండడం కానీ ఎదుటివారికి నచ్చేలా ఉండటం కాదు


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: