బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్ కి టైటిల్ రాకపోయినా టంగ్ పవర్ వచ్చింది..!
క్లియర్ కట్ గా విషయంలోకి వెళ్తే శివ జ్యోతి ఎలిమినేషన్ కాకముందు హౌస్ లో ఉన్న సమయంలో బిగ్ బాస్ హౌస్ లో ఉన్న చెట్టు దగ్గర శ్రీముఖి మరియు బాబా భాస్కర్ సరదాగా మాట్లాడుకుంటున్న తరుణంలో బాబా భాస్కర్ స్వామి గా కూర్చుని ఇంట్లో ఒక్కొక్క సభ్యుడు గురించి మాట్లాడుతూ శివ జ్యోతి గురించి మాట్లాడగా...పోయే కాలం వస్తే ఎవరు ఆపలేరు అని బాబా భాస్కర్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. దీంతో శ్రీముఖి పోయేకాలం అంటే అని ప్రశ్నించగా ముందు కనపడుతుంది లే అని బాబా భాస్కర్ టంగ్ స్లిప్ అయ్యారు. సీన్ కట్ చేస్తే ఆ వారం ఇంటి నుండి శివ జ్యోతి ఎలిమినేట్ అయింది.
ఇక టికెట్టు ఫినాలే వారంలో హౌస్ లో బాబా భాస్కర్‌తో శ్రీముఖి సోఫాలో కూర్చుని మాట్లాడుతూ ఉన్న తరుణంలో...మళ్లీ శ్రీముఖి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు మాస్టర్ అని ప్రశ్నించగా...బాబా భాస్కర్ రాహుల్ విన్నర్ అవుతాడని అని ప్రశ్నించగా శ్రీముఖి స్పందిస్తూ మరి నేను అని అనగా...నువ్వు రన్నర్ అని బాబా భాస్కర్ చెప్పటంతో చివరాకరికి రాహుల్ విన్నర్ కావడంతో...బిగ్ బాస్ హౌస్ లో బాబా భాస్కర్ కి టైటిల్ రాకపోయినా కానీ టంగ్ పవర్ వచ్చిందని సోషల్ మీడియాలో అంటున్నారు నెటిజన్లు రాహుల్ అభిమానులు.