బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో తొలి సినిమా నుండి నటుడిగా ఎంతో ప్రత్యేకతను కనబరుస్తూ నేడు బాలీవుడ్ బాద్షాగా పేరుగాంచి నటుడు షారుఖ్ ఖాన్. ముద్దుగా అభిమానులు కింగ్ ఖాన్ అని పిలుచుకునే షారుక్, ఇటీవల కొద్దిరోజులుగా కెరీర్ పరంగా సరైన సక్సెస్ లేక సతమతం అవుతున్నారు. ఇటీవల ఆయన హీరోగా వచ్చిన జీరో సినిమా బాగానే ఆడినప్పటికీ, అభిమానులు ఆశించిన రేంజ్ లో అయితే హిట్ కాలేదు. దానితో కొంత ఆలోచనలో పడ్డ షారుక్, ఈసారి తప్పకుండా మంచి విజయవంతమైన సినిమాలో నటించి, ఫ్యాన్స్ ను ఖుషి చేయాలని భావించారు.
అందుకే తొలిసారి కోలీవుడ్ యువ దర్శకుడు అట్లీకి తన సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం కల్పించారు. ఇటీవల విజయ్ తో అట్లీ తీసిన తేరి, మెర్సల్ సినిమాలు సూపర్ హిట్ కొట్టగా, ప్రస్తుతం ఆయన విజయ్ హీరోగా తెరకెక్కిస్తున్న బిగిల్ సినిమా పై కూడా అక్కడ మంచి అంచనాలు ఉన్నాయి. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్లు సమాచారం. మంచి మెసేజ్ ఓరియెంటెడ్ కథనాలను, ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా, అన్ని రకాల కమర్షియల్ అంశాలు కలగలిపి తెరకెక్కించడంలో మంచి దిట్టగా పేరుగాంచిన అట్లీ, తొలిసారి షారుక్ తో తీస్తున్న సినిమాపై అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొని ఉంది.
ఇక ఈ సినిమాలో షారుక్ ఒక పక్కా మాస్ అవతారంలో దర్శనమివ్వనున్నట్లు సమాచారం. అవుట్ అండ్ అవుట్ మసాలా యాక్షన్ ప్యాక్డ్ ఫిలిం గా తెరకెక్కబోయే ఈ సినిమాను డిసెంబర్ లో ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. తొలిసారి అట్లీ తో షారుక్ వర్క్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా మంచి హిట్ అవుతుందని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆశపడుతున్నారు. మరి ప్రారంభానికి ముందే మంచి సంచలనాన్ని క్రియేట్ చేస్తున్న ఈ సినిమా, రేపు పట్టాలెక్కి, ఆ తరువాత రిలీజ్ అయి, ఎంత మేర విజయాన్ని అందుకుటుందో చూడాలి....!!