ఎన్టీఆర్ ప్రక్కన హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన యంగ్ హీరోయిన్....??

Mari Sithara
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే మూవీలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీంగా నటిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, మైత్రి మూవీ మేకర్స్ వారి సంస్థలో కెజిఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్నారని కొద్దిరోజులుగా పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు విరివిగా ప్రసారం అవుతున్న విషయం తెలిసిందే. 

తమ బ్యానర్ లో ప్రశాంత్ ఒక సినిమా చేయనున్నారని మైత్రి సంస్థ నిర్మాతల్లో ఒకరైన నవీన్ ఎర్నేని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పడం, అలానే ఎన్టీఆర్ గారు కూడా ప్రశాంత్ గారితో వర్క్ చేయాలని భావిస్తున్నట్లు కూడా ఆయన అనడం జరిగింది. సో, దానిని బట్టి తప్పకుండా ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ మైత్రి మూవీ మేకర్స్  బ్యానర్ లో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఉంటుందని కొంత వరకు అర్ధం అవుతోంది. అంతేకాక ఇటీవల ఎన్టీఆర్ ని ప్రత్యేకంగా కలిసి ఒక కథను ప్రశాంత్ వినిపించడం జరిగింది, ఆ కథ ఎంతో బాగా నచ్చిన ఎన్టీఆర్, వీలైనంత త్వరగా దానిని మొదలెడదాం అని చెప్పినట్లు కూడా వార్తలు గట్టిగా వినిపించాయి. 

అయితే ఆ సినిమాలో హీరోయిన్ గా రష్మిక ని తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రశాంత్ కథను చెప్పే సమయంలోనే ఫిక్స్ అయ్యారని, ఆ విషయాన్ని ఎన్టీఆర్ కు కూడా చెప్పడంతో, ఆయన కూడా ఓకే అన్నారని అంటున్నారు. అయితే ఈ వార్తపై ఇప్పటివరకు ఎక్కడా కూడా అధికారిక ప్రకటన లేనప్పటికీ, ప్రశాంత్ మరియు ఎన్టీఆర్ సినిమాలో మాత్రం రష్మిక నటించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నట్లు చెప్తున్నారట ఆయన సన్నిహితులు కొందరు. మరి ఇందులో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియాలంటే మాత్రం మరి కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే....!! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: