మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా సినిమా సైరా నరసింహారెడ్డి ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఒకింత యావరేజ్ టాక్ ని సంపాదించిన విషయం తెలిసిందే. మెగాస్టార్ సరసన తొలిసారి నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అనుష్క, తమన్నా, నిహారిక కొణిదెల ప్రత్యేక పాత్రల్లో నటించడం జరిగింది. అమితాబ్ బచ్చన్, కిచ్చ సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, రవి కిషన్ వంటి దిగ్గజ నటులు నటించిన ఈ సినిమాపై మొదటి నుండి టాలీవుడ్ సహా పలు ఇతర భాషల ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు ఉన్నాయి. అయితే అత్యంత భారీ బడ్జెట్ తో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కిన ఈ సినిమా కథ మరియు కథనాలు ఆకట్టుకున్నప్పటికీ,
వాటిని తెరపై ప్రేక్షకుడిని ఆకట్టుకునేలా దర్శకుడు పూర్తి స్థాయిలో తెరకెక్కించలేకపోవడంతో కేవలం యావరేజ్ దగ్గర ఆగిపోవలసి వచ్చింది. ఇకపోతే రెండవ రోజు నుండి మెల్లగా ఈ సినిమాకు కలెక్షన్స్ తగ్గుముఖం పట్టినట్లు తెలుస్తోంది. ఇక రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన చాణక్య మంచి టాక్ ని సంపాదించడంతో, కొంతవరకు దాని దెబ్బ సైరా పై పడిందని అంటున్నారు. ఇక ప్రస్తుతం దసరా సెలవలు సాగుతుండడంతో ఒకింత పర్వాలేదనిపించేలా కలెక్షన్స్ సాధిస్తున్న సైరా, ఈ రెండు రోజుల తరువాత చాలావరకు తక్కువ స్థాయిలో కలెక్షన్స్ తో ముందుకు సాగె అవకాశం కనపడుతోందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.
ఇప్పటివరకు రూ.83 కోట్లవరకు మొత్తంగా షేర్ కలెక్షన్ ని కొల్లగొట్టిన ఈ సినిమా, ఓవర్ ఆల్ గా రూ.125 కోట్లవరకు మాత్రమే రాబట్టే అవకాశాలు గట్టిగా కనపడుతున్నాయని అంటున్నారు. ఇక వారు చెప్తున్న ప్రకారం, రూ.200 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా, మొత్తంగా భారీగానే బయ్యర్లకు దెబ్బేయనుందని అంటున్నారు. అయితే ఈ విషయమై సినిమా యూనిట్ కూడా ఒకింత ఆందోళన చెందుతోందట. నిజానికి తాము సినిమా ఓవర్ ఆల్ గా మంచి కలెక్షన్స్ రాబడుతుందని భావించామని, అయితే సైరా ఇప్పటికే చాలా ఏరియాల్లో డల్ గా ముందుకు సాగడం చూస్తుంటే, ఇది తమకు ఊహించని దెబ్బె అని వారు కూడా భావిస్తున్నారట. మరి సైరా మొత్తంగా ఎంతమేర కలెక్షన్స్ కొల్లగొడుతుందో తెలియాలంటే మరికొద్దిరోజలు వెయిట్ చేయాల్సిందే....!!