టాలీవుడ్ చార్మింగ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల భరత్ అనే నేను, మహర్షి సినిమాలతో వరుస విజయాలు దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే అంతక ముందు రెండు పరాజయాలతో కొంత నిరాశ చెందిన సూపర్ స్టార్, ప్రస్తుతం ఈ రెండు విజయాల తరువాత సరిలేరు నీకెవ్వరు అనే తాజా సినిమాలో మంచి జోష్ తో నటిస్తున్నారు. ఇప్పటివరకు కెరీర్ పరంగా ఒక్క ఫ్లాప్ కూడా చవిచూడని అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో సహా సాధారణ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.
ఇక సినిమాలతో పాటు పలు బ్రాండ్స్ కి కూడా ప్రచారం చేసే మన సూపర్ స్టార్, ఇటీవల తన భాగస్వామ్యంతో కొందరు యువకులతో కలిసి హంబుల్ కో అనే ఆన్లైన్ క్లాతింగ్ స్టోర్ ని తెరిచిన విషయం తెలిసిందే. యువతను ఆకట్టుకునే విధంగా అందరికీ అందుబాటు ధరల్లో ఈ సైట్ లో దుస్తులు లభ్యం అవుతున్నాయి. ఇక ఇటీవల ఈ వెబ్ సైట్ లాంచ్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన మహేష్ బాబు, తాను మొదట మనిషినని, ఆ తరువాతే యాక్టర్ ని అనే కాన్సెప్ట్ తో హంబుల్ బ్రాండ్ ని ప్రమోట్ చేయడం జరిగింది.
ఇక నేడు ఈ సైట్ కి సంబంధించి సూపర్ స్టార్ మహేష్ తో పాటు మరికొందరు నటించిన లేటెస్ట్ యాడ్ ని తన సోషల్ మీడియా మాధ్యమాల్లో రిలీజ్ చేసారు మహేష్ బాబు. మంచి ఆకట్టుకునే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ యాడ్ లో మహేష్ బాబు ఎంతో యంగ్ గా కనపడుతున్నారు. ఇక ప్రస్తుతం ఈ యాడ్ యూట్యూబ్ లో వీక్షకులను ఆకట్టుకుంటూ మంచి వ్యూస్ తో దూసుకుపోతుండగా, పలువురు సూపర్ స్టార్ ఫ్యాన్స్ దీనిని, పలు విధాలుగా లైక్స్ మరియు షేర్స్ చేస్తూ విపరీతంగా వైరల్ చేస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ యాడ్ పై ఒక లుక్ వేయండి....!!