బ్యాటరీ ఛార్జింగ్ చేసుకుంటున్న మహేష్ బాబు.....!!

Mari Sithara
టాలీవుడ్ హీరో మహేష్ బాబు ప్రస్తుతం అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను మహేష్, అనిల్ సుంకర, దిల్ రాజులు కలిసి ఎంతో భారీగా నిర్మస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ఇక ఇటీవల భరత్ అనే నేను, 

మహర్షి సినిమాలతో రెండు వరుస బ్లాక్ బస్టర్ లు కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం చేస్తున్న సరిలేరు నీకెవ్వరు తో హ్యాట్రిక్ విజయం దక్కించుకోవాలని చూస్తున్నారు. అయితే తనకు ఏ మాత్రం తనకు విరామం దొరికినా, వెంటనే కుటుంబంతో కలిసి విదేశాలకు టూర్ వెళ్లే మహేష్ బాబు, మూడు రోజుల క్రితం సరిలేరు నీకెవ్వరు తాజా షెడ్యూల్ పూర్తవడంతో, తన కుటుంబంతో కలిసి స్విట్జర్లాండ్ పయనమై వెళ్లారు. ఇక అక్కడ ప్రస్తుతం బాగా ఎంజాయ్ చేస్తున్న మహేష్ బాబు, నేడు తన సోషల్ మీడియా మాద్యమాల ద్వారా ఒక పోస్ట్ చేసారు. 

'దసరా సందర్భంగా ఈ విశ్వంలో నాకు ఎంతో ఇష్టం అయిన నా ఫేవరెట్ ప్లేస్ స్విస్ కు వచ్చాను, నాకు ఎంతో ఇష్టమైన ఈ ప్రదేశంలో కొన్నాళ్ళపాటు ఇక్కడ మమ్మల్ని మేము రీచార్జ్ చేసుకున్న తర్వాత మళ్లీ మీ అందరి ముందుకు దర్శనం ఇస్తాం' అంటూ తన ట్వీట్ ద్వారా మహేష్ తెలపడం జరిగింది. కాగా ప్రస్తుతం మహేష్ బాబు చేసిన ట్వీట్ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతుంది. ఇకపోతే సరిలేరు నీకెవ్వరు తదుపరి షెడ్యూల్ ఈనెల రెండవ వారంలో జరుగనున్నట్లు సమాచారం. రష్మిక హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు..సీనియర్ నటి విజయశాంతి కొన్నేళ్ల తరువాత ఈ సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే..!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: