'సైరా' లో మెయిన్ హైలైట్స్ ఏవంటే.....??

Mari Sithara
మెగాస్టార్ చిరంజీవి హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ సైరా నరసింహారెడ్డి. తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై కేవలం మెగాభిమానుల్లోనే కాక సాధారణ ప్రేక్షకుల్లోనూ మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్, ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు మరింతగా పెంచడం జరిగింది. మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్, 

తన కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ సినిమాకు బాలీవుడ్ సంగీత దర్శకుడు అమిత్ త్రివేదీకి సంగీతాన్ని అందిస్తుండగా, రత్నవేలు కెమెరా మ్యాన్ గా వ్యవహరిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ మొత్తం పూర్తి చేసుకున్న ఈ సినిమాను వచ్చేనెల 2వ తేదీన గ్రాండ్ గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో హైలైట్స్ గా ఉండబోయే సీన్లకు సంబంధించి నేడు టాలీవుడ్ వర్గాల్లో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. దానిని బట్టి, ఈ సినిమా బిగినింగ్ లో వచ్చే సన్నివేశాలు, మెగాస్టార్ ఇంట్రడక్షన్ సీన్, ఫస్ట్ హాఫ్ లో నీటి అడుగున జరిగే ప్రీ ఇంటర్వెల్ ఎపిసోడ్స్ ఎంతో అద్భుతంగా ఉంటాయట. 

ఇక సెకండ్ హాఫ్ కొంత గడిచిన తరువాత వచ్చే ఛేజింగ్ తో కూడిన యాక్షన్ సీన్ ఎంతో బాగుంటుందని, ఇక క్లైమాక్స్ లో బ్రిటిష్ వారితో జరిగే వార్ సీన్, ప్రేక్షకుల రోమాలు నిక్కబొడుచుకునేలా చేస్తుందని టాక్. అంతేకాక అమిత్ త్రివేది పాటలతో పాటు, జూలియస్ పాకీయం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరింత అద్భుతం అంటున్నారు. ఇక సినిమాలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఆకట్టుకుంటాయని, వాటితోపాటు సినిమాలో భారీ సెట్టింగులు కూడా ప్రధానాకర్షణగా నిలవనున్నాయట. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలను బట్టి చూస్తే, సైరా సినిమా మంచి విజయాన్ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు సినీ విశ్లేషకులు.......!! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: