ఇప్పటికే స్టార్ మా ఛానల్ లో ప్రసారం అయిన బిగ్ బాస్ రెండు సీజన్లు కూడా మంచి ప్రేక్షకాదరణ మరియు అద్భుతమైన రేటింగ్స్ సంపాదించడం జరిగింది. మొదట్లో ఈ షో ప్రారంభ సమయములో కొన్ని విమర్శలు ఎదురయినప్పటికీ, మెల్లగా ఈ షో మన ప్రేక్షకులకు కనెక్ట్ అవుతూ వచ్చింది. ఇక ఈ షో మొదటి సీజన్ కు టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, అలానే రెండవ సీజన్ కు నాచురల్ స్టార్ నాని హోస్ట్ లుగా వ్యవహరించడం జరిగింది. ఎన్టీఆర్ హోస్ట్ గా ఉన్న సమయంలో ఆయన తన అద్భుతమైన వాక్చాతుర్యంతో ఆకట్టుకుని షో ని సక్సెస్ చేయగా,
ఆ తరువాత రెండవ సీజన్ కు హోస్ట్ గా వచ్చిన నాని, తన టాలెంట్ తో షోని మరింత సక్సెస్ఫుల్ గా ముందుకు తీసుకెళ్లారు. ఇక ఇటీవల కింగ్ నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన మూడవ సీజన్ కూడా ప్రస్తుతం మంచి రసవత్తరంగా సాగుతోంది. అయితే గత వారం నాగార్జున విదేశాల్లో ఉండడంతో, ఆయన స్థానంలో సీనియర్ నటి రమ్యకృష్ణ హోస్ట్ గా వ్యవహరించి షో ని నడిపించారు. ఇక ఈ వారం నాగార్జున యధావిధిగా హోస్ట్ గా రీఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వారం బిగ్ బాస్ షోకు ఒక ప్రత్యేక అతిథి విచ్చేసి షోలో మరింత జోష్ ని నింపనున్నారు. ఆయన మరెవరో కాదు నాచురల్ స్టార్ నాని, అతి త్వరలో నాని నటిస్తున్న గ్యాంగ్ లీడర్ సినిమా రిలీజ్ కానున్న సందర్భంగా నాని,
ఆ సినిమా ప్రమోషన్ నిమిత్తమై బిగ్ బాస్ కు రానున్నట్లు సమాచారం. ఇక నాని ఈ రోజు ఎంట్రీ ఇవ్వనున్న స్పెషల్ ప్రోమోను కాసేపటి క్రితం యూట్యూబ్ లో రిలీజ్ చేసింది స్టార్ మా ఛానల్ యాజమాన్యం. ఇక ఆ వీడియో చూసిన పలువురు నెటిజన్లు దానిని షేర్స్, లైక్స్ తో సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. మరి ఈ వారం ఎలిమినేషన్ జోన్లో ఉన్నవారిలో ఎవరు ఎలిమినేటి అవుతారో, అలానే ఈ వారం నాని సర్ప్రైజ్ ఎంట్రీతో షో ఏ విధంగా రక్తికడుతుందో తెలియాలంటే మాత్రం ఈరోజు రాత్రి బిగ్ బాస్ ప్రోగ్రాం ప్రసారం అయ్యేవరకు వేచి చూడాల్సిందే.....!!