బీచ్‌రోడ్ చేతన్ ఏం చేశాడు...?
దర్శక-నిర్మాత-హీరో చేతన్ మద్దినేని మాట్లాడుతూ.. రోజులు మారాయి, గల్ఫ్, ఫస్ట్ ర్యాంక్ రాజు చిత్రాలు సక్సెస్ అయి హీరోగా మంచి పేరు తెచ్చాయి. కానీ ఇండివిడ్యువల్ గా చేతన్ మద్దినేని అనేంతగా సరైన గుర్తింపు రాలేదు. దానికోసమే ఈ ప్రయత్నం చేశాను. ఆ మూడు చిత్రాల తర్వాత చాలా కథలు విన్నాను. ఏది అంతగా నచ్చలేదు. నేనే సొంతంగా కథ రాసుకున్నాను. కమర్షియల్ అంశాలను జోడించి ర అండ్ రియలిస్టిక్ రస్టిక్ కంటెంట్ తో "బీచ్ రోడ్ చేతన్" సినిమా చేశాను. సినిమా అంత వైజాగ్ లో షూట్ చేయడం జరిగింది. అక్కడ నాకు టెక్నీకల్ గా ఈశ్వర్ రావ్, మోహన్, వీరేష్ మోరల్ సపోర్ట్ చేసారు. ముఖ్యంగా కెమెరామెన్ నిశాంత్ చాలా కష్టపడ్డాడు. అలాగే ఈ చిత్రంలో వంద మంది కొత్త ఆర్టిస్టులను పరిచయం చేశాం. అందరి సహకారం ఉండబట్టే ఈజీగా సినిమా పూర్తి చేయగలిగాం. బీచ్ రోడ్ లో తిరిగే ఒక బేవర్స్ కథ ఇది. బీచ్ అనగానే యూత్ ని రిప్రజెంట్ చేసే విధంగా ఉంటుంది. ఈ చిత్రంలో నేను చేతన్ క్యారెక్టర్ చేశాను. అందుకే ఈ చిత్రానికి బీచ్ రోడ్ చేతన్ అని పెట్టడం జరిగింది. ఈ సినిమాతో చేతన్ మద్దినేనిగా నాకు మరింత గుర్తింపు లభిస్తుందనే కాన్ఫిడెన్స్ తో వున్నాను. వచ్చేనెలలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.