పెళ్లి చూపులు సినిమాతో తొలిసారి హీరోగా నటించి మంచి విజయాన్ని అందుకున్న విజయ్ దేవరకొండ, ఆ తరువాత సందీప్ రెండి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో మంచి క్రేజ్ సంపాదించడం జరిగింది. ఆ తరువాత వచ్చిన గీత గోవిందం సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ సాదించడంతో, విజయ్ కు టాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ మరియు మార్కెట్ ఏర్పడి, టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరిగా విజయ్ సుస్థిర స్థానాన్ని సంపాదించారు. ఇకపోతే అతి త్వరలో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటించనున్న విజయ్, ఇటీవల రిలీజ్ అయిన డియర్ కామ్రేడ్ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోవడంతో కొంత ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా ఈ సారి పూరీతో చేసే సినిమాతో మంచి హిట్ కొట్టి, తన ఫ్యాన్స్ ని ఖుషీ చేయాలని భావిస్తున్నాడు. ఇకపోతే అసలు మ్యాటర్ ఏంటంటే,
విజయ్ నటించిన గత చిత్రం డియర్ కామ్రేడ్, తొలిరోజు కాస్త మిక్స్డ్ టాక్ సంపాదించినప్పటికీ, తరువాత మాత్రం నెగటివ్ టాక్ తో చాలా వరకు కలెక్షన్స్ సాధించడంలో వెనుకపడిపోయింది. ఈ సినిమా మంచి కాన్సెప్ట్‌తో తెరకెక్కినప్పటికీ మద్య మద్యలో కొంచెం సాగతీతగా ఉందని, అలానే రన్ టైం ఎక్కువ ఉందని, పలు విధాలుగా నెగటివ్ రివ్యూలు వచ్చాయి. అయినప్పటికీ సినిమాను తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారని యూనిట్ సబ్యులు అనుకున్నారు, కానీ అది జరుగలేదు. ఇందులో బాబీ గా విజయ్ దేవరకొండతో పాటు రష్మిక మందన్నా నటనకు ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు పడ్డాయి. ముఖ్యంగా లిల్లీ పాత్రలో రష్మిక అద్బుత నటన పై ప్రశంసల వర్షం కురిసింది. మొదటి వారాంతంలో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.18.85 కోట్లు షేర్ వసూలు చేసింది. అందులో తెలుగు రాష్ట్రాల షేర్ రూ. 12.56 కోట్లు. కాగా ఈ సినిమా మొదటి రోజు రూ.6.83 కోట్లు కలెక్షన్ వసూలు చేయడం గమనార్హం.
ఇకపోతే ఇటీవల ఈ సినిమా వెబ్ మీడియా మాధ్యమం అమేజాన్ ప్రైమ్‌లో విడుదలై భారీ స్థాయిలో వ్యూస్ రాబడుతున్నట్లు సమాచారం. అలానే గతంలో ఏ తెలుగు సినిమాకు కూడా రాని స్థాయిలో ‘డియర్ కామ్రేడ్' అదిరిపోయే క్లిక్స్ తో కుమ్మేస్తుందని అంటున్నారు. ఇప్పటికే ఈ సినిమాను చాలా మంది చూశారని, దీంతో పలు రికార్డులు కూడా బద్దలయ్యాయని సమాచారం. మరి ఈ విధంగా విజయ్ నటించిన డియర్ కామ్రేడ్ సినిమా, థియేటర్స్ లో ఫట్ అయినప్పటికీ, వెబ్ మీడియాలో మాత్రం హిట్ సాధించడంతో విజయ్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు.....!!