కచ్చితంగా పడుకోవాలి అంటు షాకింగ్ కామెంట్స్ చేసిన బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి..!
ఇటువంటి నేపథ్యంలో దక్షిణాదిలో కూడా సీరియల్స్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉన్నట్లు చెబుతోంది బిగ్ బాస్ కంటెస్టెంట్ రోహిణి. గత వారం ఎలిమినేట్ అయిన రోహిణి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కెరీర్ ఆరంభంలో తాను ఎదుర్కొన్న కష్టాలను అనుభవాలను పంచుకుంది. బీటెక్ పూర్తి చేసి హైదరాబాద్ కి ఉద్యోగం కోసం వచ్చినట్లు తెలిపింది. అయితే ఆ తర్వాత నటన మీద ఆసక్తితో ఇండస్ట్రీకి షిఫ్ట్ అయినట్లు చెప్పుకొస్తూ...ఓ సీరియల్ లో అవకాశం ఉందని తెలిసి ఆడిషన్ కోసం నిర్మాతలను వెళ్లి కలిసినప్పుడు ఏకంగా తనను ఇద్దరు కమిట్మెంట్ అడిగినట్లు చెప్పింది.
దీంతో అక్కడ నుండి వచ్చేశానని.. ఆ తరువాత మరో ఆడిషన్ లో కూడా ఇదే అనుభవం ఎదురైందని.. వయసులో చాలా పెద్ద వ్యక్తి తనను ఇబ్బంది పెట్టాడని.. అవకాశం ఇస్తా.. నాకేం ఇస్తావ్ అంటూ డైరెక్ట్ గా అడిగేవాడు అంటూ చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో ఇటువంటి పరిస్థితులు ఉన్నా నా నటన తో నలుగురు మెచ్చుకునే స్థాయికి ఎదిగానని చెప్పుకొచ్చింది. కాస్టింగ్ కౌచ్ అనేది చాలా చోట్ల ఉంటుందని కానీ గ్లామర్ ఫీల్డ్ లో ఎక్కువగా ఉంటుందని రోహిణి పేర్కొంది.