తెలుగు సినిమా రికార్డులను అడుగు ఆ కొదమసింహం గర్జిస్తే ఎలా ఉంటుందో..
తను ఛాలెంజ్ చేస్తే బాక్సాఫీస్ షేక్ ఆడాల్సిందే..
అభిమానుల క్రమశిక్షణకు ఆది గురువు.. కష్టకాలంలో ఆదుకునే అపద్బాంధవుడు అతడు.
నీ కష్టమే నీ ఫలితం అంటూ స్వయంకృషితో ఎలా ఎదగాలో చూపించాడతను..
మెగాస్టార్ అన్న బిరుదు ఉన్నా ఇప్పటికి తానో నూతన నటుడినే అన్నట్టుగా ఆయన చూపించే వినమ్రత గురించి చెప్పాలంటే మాటలు చాలవేమో.. అందుకే తెలుగు పరిశ్రమలో వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ అంటే చిరంజీవి మత్రమే.
టాలీవుడ్ టాప్ చెయిర్ గురించి మెగా ఫ్యాన్స్ చిరు మీద చెప్పుకునే ఓ ప్రత్యేకమైన డైలాగ్.. సింహాసనం మీద కుర్చునే అర్హత ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ ఇంద్రసేనుడిది అంటే మన మెగాస్టార్ చిరంజీవిదే అన్నమాట.
అప్పట్లో హీరో అంటే కేరాఫ్ అడ్రెస్ చిరంజీవే.. సినిమాలంటే ఇష్టం ఉన్న ప్రతి ఒక్కరికి చిరంజీవి గురించి పరిచయం ఉంటుంది. ఇక సినిమాల్లో రాణించాలనుకునే వారికి చిరంజీవే ఓ స్పూర్తి.
ఇప్పటికి తనకు ఇంతటి క్రేజ్ ఫాలోయింగ్ ఇచ్చిన అభిమానుల కోసం 64 ఏళ్ల వయసులో కూడా సైరా నరసింహా రెడ్డిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
ఇప్పుడంటే టెక్నాలజీ పెరిగి హీరోలంతా ప్రయోగాలు చేస్తున్నారు కాని అసలు ఎలాంటి టెక్నాలజీ లేకుండా ప్రయోగాత్మక సినిమాలు చేసిన స్టార్ మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటివరకు ఏ తెలుగు నటుడికి దొరకని సౌత్ సిని పరిశ్రమ నుండి ఆస్కార్ అవార్డ్ ఈవెంట్ కు గెస్ట్ గా అటెండ్ అయిన సౌత్ ఇండియన్ స్టార్ చిరంజీవి. 1987లో చిరంజీవి అకడెమీ అవార్డుల వేడుకకు అటెండ్ అయ్యారు.
తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవిది ఓ చరిత్ర.. ఆయన వేసిన పూలబాటలోనే ఆయన తర్వాత వారసులు హీరోలుగా ఎంట్రీ ఇచ్చి, వారు కూడా సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతుంది టీం ఏపిహెరాల్డ్.కామ్ .