యంగ్‌రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తోన్న హై ఓల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ సాహో. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ నెల 30న రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సినిమా టీజర్, ముంబైలో ట్రైలర్ లాంచ్ అన్ని సినిమాపై ఉన్న అంచనాలను ఆకాశానికి చేర్చేశాయి. మరోవైపు
సాహో సినిమా ప్రమోషన్స్ పీక్స్ లో ఉన్నాయి. తాజాగా రామోజీ ఫిల్మ్‌సిటీలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా దుమ్ము రేపేసింది.
సాహో యాక్షన్ ఎంటెర్టైనెర్ గా తెరకెక్కిన ఇందులో రొమాంటిక్ యాంగిల్ కూడా ఉంది. లవ్ ట్రాక్ ని కూడా సుజీత్ హైలెవల్ స్టాండర్డ్స్‌లో తెరకెక్కించాడు. అయితే ప్రభాస్ ఎంత భారీతనంతో రొమాంటిక్ ట్రాక్ తెరకెక్కిస్తున్నా వాస్తవంగా శ్రద్ధాకపూర్‌కు, ప్రభాస్‌కు లుక్స్ పరంగా అంత రొమాంటిక్ యాంగిల్ ఉండదు. ప్రభాస్‌లో యాక్షన్ లుక్స్ డామినేటింగ్‌గా ఉంటాయే తప్పా... రొమాంటిక్ యాంగిల్ అంతగా ఉండదు.
అటు శ్రద్ధాలోనూ రొమాంటిక్‌గా ఆకర్షించే యాంగిల్ తక్కువే. ఆమె బాలీవుడ్‌లో మిగిలిన హీరోయిన్లలో ప్రేక్షకులను, యూత్‌ను కైపెక్కించలేదు. చాలామంది హీరోయిన్స్ కి ఉండాల్సిన ఆకర్షణ ఆమెలో ఉండదు. ఈ లెక్కన చూస్తే సినిమాలో రొమాంటిక్ యాంగిల్ అంత సూటబుల్‌గా ఉండదనే అంటున్నారు. ఇక ఈ భారీ యాక్షన్ సినిమాకు పాటలు కూడా సెట్ కావని అంటున్నారు.
శ్రద్ద కపూర్ ఎంతగా గ్లామర్ ఒలకబోసినా.. ఆమె గ్లామర్ లుక్ లో తేలిపోవడం ఒక ఎత్తైతే.. రొమాంటిక్ యాంగిల్ ప్రేక్షకులను ఎంత వరకు కనెక్ట్ చేస్తుందన్నది రెండో సందేహం. ఇక జాక్వెలైన్ ఫెర్నాండెజ్ సాంగ్ ఏదైనా మాస్‌కు ఎక్కుతుందా ? అన్నది చూడాలి. ఏదేమైనా సాంగ్స్, రొమాంటిక్ ట్రాక్ సాహోకు బలమా ? బలహీనతా ? అన్నది 30న తేలిపోనుంది.