మన్మధుడు -2 సెన్సార్ టాక్ : సినిమా చూసి షాకైన సెన్సార్ సభ్యులు.....??

Mari Sithara
టాలీవుడ్ లో 17 ఏళ్ల క్రితం విడుదలైన నాగార్జున మన్మధుడు సినిమా మంచి సక్సెస్ ని అందుకుంది. ఇక మళ్ళి ఇన్నేళ్లకు ఆ సినిమాకు సీక్వెల్ గా మన్మధుడు2 రాబోతుండడంతో అక్కినేని ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇటీవల ఈ సినిమా ట్రైలర్ మరియు సాంగ్స్ బయటకు వచ్చిన తరువాత ఆ అంచనాలు మరింతగా పెరిగాయని చెప్పాలి. అలానే ట్రైలర్ లో నాగార్జున ఎంతో యంగ్ గా కనపడడంతో పాటు ఆయనకు జోడిగా నటించిన రకుల్ కూడా వెరైటీ క్యారెక్టర్ లో నటిస్తున్నట్లు మనకు అర్ధం అవుతుంది. 

ఇక ఈ సినిమాకు సంబంధించి సెన్సార్ నుండి కాసేపటి క్రితం యు/ఏ సర్టిఫికెట్ లభించడంతో, సినిమాను వీక్షించిన సెన్సార్ సభ్యులు మన్మధుడు2 యూనిట్ పై ప్రశంశలు కురిపించారట. సినిమా మొత్తాన్ని నాగార్జున ఎంతో ఆకట్టుకునేలా ఒంటిచేత్తో నడిపించారని, చాలావరకు సినిమా ఎక్కడా కూడా బోర్ కొట్టకుండా ఎంటర్టైనింగ్ పగా సాగుతుందని, అలానే స్క్రీన్ పై నాగ్, రకుల్ ల జోడి ఎంతో బాగుందని అన్నట్లు సమాచారం. ఇక సినిమాలోని మిగతా పాత్రల్లో నటించిన లక్ష్మి, వెన్నెల కిశోర్, రావు రమేష్, ఝాన్సీ వంటి వారు సినిమాకు చాలా ప్లస్ అయ్యారని, ముఖ్యంగా సినిమాలో కేవలం మూడే మూడు సాంగ్స్ ఉండడం వలన ఆడియన్స్ కు అవి కొంత రిలీఫ్ ని అందిస్తాయని చెప్పినట్లు సమాచారం. 

మొత్తంగా ఒక హృద్యమైన ప్రేమకథను ఫ్యామిలీ ఎమోషన్స్ తో కలగలిపి, యువ దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఈ సినిమాను ఎంతో అద్భుతంగా తెరకెక్కించారని వారు అభిప్రాయపడ్డారట. అయితే సెన్సార్ సభ్యుల నుండి అభినందనలు అందుకున్న మన్మధుడు2 యూనిట్, తమ సినిమా తప్పకుండా రేపు విడుదల తరువాత ప్రేక్షకులను అలరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తోందట. ఇక నిర్మాతల్లో ఒకరైన నాగార్జున కూడా సెన్సార్ వారి టాక్ తో ఎంతో ఆనందంగా ఉన్నారట. మరి మరొక మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ఎటువంటి టాక్ ని, ఎంతమేరకు కలెక్షన్ ని రాబడుతుందో వేచి చూడాలి.....!! 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: