ఆర్.ఎక్స్.100 ఫేమ్ కార్తికేయ హీరోగా, మలయాళ భామ అనఘ హీరోయిన్ గా తెరకెక్కిన చిత్రం ‘గుణ 369’. అర్జున్ జంధ్యాల దర్శకుడు. స్ప్రింట్ ఫిలిమ్స్, జ్ఞాపిక ఎంటర్టైన్మెంట్స్, ఎస్జీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించాయి. అన్ని కార్యక్రమాలు పూర్తీ చేసుకున్న ఈ సినిమా శుక్రవారం విడుదల అవుతున్న సందర్బంగా హీరోయిన్ అనఘా చెప్పిన విశేషాలు..
నేను మలయాళీ అమ్మాయిని, ఎం టెక్ చేశాను. మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్. మాది సినిమా నేపథ్యం ఉన్న కుటుంబం కాదు. కానీ నాకు చిన్నప్పటినుండి సినిమాల్లో నటించాలన్నా ఆసక్తి ఉండేది. చదువు పూర్తయ్యాక ఎం టెక్ సమయంలో కొచ్చి లో ట్రైనింగ్ సమయంలో పలువురు సినిమావాళ్లతో పరిచయాలు ఏర్పడ్డాయి. అలా మలయాళంలో ఓ సినిమాలో సెకండ్ లీడ్ గా ఎంపిక చేసారు. ఆ సినిమా హిట్ అవడంతో హీరోయిన్ గా అక్కడే మరో రెండు సినిమాలు చేశాను. ఆ తరువాత తమిళంలో హిప్ హాఫ్ తమిజా హీరోగా ఓ సినిమా చేశా అది సూపర్ హిట్ అవ్వడంతో ఈ సినిమా దర్శకుడు అర్జున్ నా ఫోటోలు చూసి నన్ను కలిసాడు. ఈ పాత్ర అచ్చంగా మన పకింటి అమ్మాయిగా కనిపించాలని దర్శకుడు నన్ను ఎంపిక చేసాడు.
ఈ కథ నాకు బాగా నచ్చింది. చాల మంచి పాత్ర .. దానికి తగ్గట్టుగానే మంచి ఎమోషన్ పలికించే అవకాశం ఉంది. తెలుగు పరిశ్రమ అంటే సౌత్‌లో పెద్ద పరిశ్రమ ఇక్కడ అవకాశం రావడం నిజంగా అదృష్టాంగా భావిస్తాను. హీరో కార్తికేయతో పనిచేయడం చాలా ఎంజాయ్ చేశాను. తాను చాలా కష్టపడే తత్వమున్న వ్యక్తి. డెడికేషన్ చూసి షాకయ్యా. ఈ సినిమాలో అన్ని రకాల ఎమోషన్స్ ఉంటాయి. మంచి ప్రేమ, యాక్షన్, కామెడీ. తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఉంది. అలాగే గ్లామర్ విషయంలో కూడా కథ డిమాండ్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. తెలుగులో మలయాళీ అమ్మాయిల హవా ఎక్కువగా ఉంది. నిజంగా ఆ విషయంలో హ్యాపీగా ఉన్నా నాకు మా వల్లే కాంపిటీషన్ అని అనుకోను. ఈ సినిమా తప్పకుండా అందరికి నచ్చుతుంది. ఈ సినిమా తరువాత ఇంకేమి అవకాశాలు రాలేదు .. అంటూ ముగించారు