ఇండియా ఎన్నికల్లో హట్ టాపిక్‌గా పాక్ అణ్వాయుధాలు?

Chakravarthi Kalyan
లోక్ సభ ఎన్నికల సమయంలో కాంగ్ఎస్ సీనియర్ నేతలు చేస్తున్న వివాదాస్పద వ్యాఖ్యలు ఆ పార్టీకి తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ ను ఓడించేది నరేంద్ర మోదీ కాదు.  ఆ పార్టీ నాయకులే అనే వాదన కూడా తెరపైకి వస్తోంది. మొన్నటికి మొన్న  వారసత్వ పన్ను, దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లులా ఉంటారు అని కాంగ్రెస్ సీనియర్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఎంత దూమారం రేపాయో మనందరం చూశాం.

నిన్న దేశంలో నిగ్రోలు ఉన్నారంటూ కాంగ్రెస్ లోక్ సభ పక్ష నేత అధిర్ రంజన్ చౌధరి మరో వివాదానికి తెర తీశారు. తాజాగా మరో సీనియర్ నాయకుడు మణి శంకర్ అయ్యర్ భారత్ పాక్ సంబంధాలపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పాకిస్థాన్ దగ్గర అణుబాంబులు ఉన్నాయి. కాబట్టి ఆ దేశాన్ని మనం గౌరవించాలి. లేదంటే భారత్ పై అణ్వస్త్రం ప్రయోగించాలన్న ఆలోచన పాక్ కు వస్తుంది. ఇది అంతిమంగా మనకే నష్టం చేకూరుస్తుంది. కాబట్టి పాక్ తో కూర్చొని చర్చించాలి అని పేర్కొన్నారు.

కాబట్టి బీజేపీకి అవకాశాలు ఇవ్వడంలో కాంగ్రెస్ నాయకులు ముందు ఉంటారు అని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం మణిశంకర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. దీనిని నరేంద్ర మోదీ కూడా ప్రస్తావిస్తూ.. కాంగ్రెస్ వాస్తవ సిద్ధాంతాలు బయట పడ్డాయని దుయ్యబట్టింది. కాంగ్రెస్ నేతలు భారత్ ఆత్మను కూడా చంపేందుకు యత్నిస్తున్నారని దుయ్యబట్టారు. సొంత దేశ ప్రజలనే భయపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు.

గతంలో భారత్ పై ఉగ్రవాదులు దాడులు చేసినా.. గత కాంగ్రెస్ ప్రభుత్వం వారితో కూర్చొని చర్చించింది తప్ప మరేమీ చేయలేకపోయిందని విమర్శించారు.  మన దేశాన్ని తక్కువ చేసి చూస్తున్నారని.. కాంగ్రెస్ నాయకులకు దేశ భక్తి లేదని పేర్కొన్నారు.  మొత్తం మీద కాంగ్ఎస్ నాయకులు చేసిన ప్రకటనలను ప్రధాని మోదీ రెండు చేతులా ఒడిసిపట్టుకొని రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. ఇప్పటికి అయినా కాంగ్రెస్ నాయకులు సంయమనం పాటించాలని పలువురు సూచిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: