రాయలసీమ( తాడిపత్రి): టిడిపి-వైసీపీల మధ్య ఫ్యాక్షన్.. సినిమాలను మించి..?

Divya
ఆంధ్రప్రదేశ్లో సోమవారం రోజున సార్వత్రిక ఎన్నికల సైతం ముగిసాయి.. అయితే పోలింగ్ సమయంలో వైసీపీ పార్టీ టిడిపి పార్టీల మధ్య కొన్ని ప్రాంతాలలో అల్లర్లు అరాచకాలు వంటివి సృష్టిస్తున్నాయి. ఇప్పటికీ కూడా అలాంటి అల్లర్లు పలు ప్రాంతాలలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమలోని ఫ్యాక్షన్ కి పెట్టింది పేరు అనంతపురం.. ఈ జిల్లాలోని తాడిపత్రిలో మరొకసారి టిడిపి, వైసిపి మధ్య వార్ సినిమాలను తలపించేలా కనిపిస్తోంది.. తాడిపత్రి పట్టణంలో టిడిపి పార్టీ నేత జెసి దివాకర్ రెడ్డి ఇంటి పైన వైసిపి కార్యకర్తలు సైతం రాళ్ల దాడి చేసినట్లుగా తెలుస్తోంది. అయితే ఈ దాడి కేతిరెడ్డి పెద్దారెడ్డి అనుచరులు చేశారని వార్తలు వినిపిస్తున్నాయి.

ముందుగా దివాకర్ రెడ్డి అనుచరుల సైతం వైసీపీ నేతలపై దాడిని ప్రయత్నించారు. ముఖ్యంగా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటి పైన పలువురు టిడిపి నేతలు రాళ్లదాడి చేసినట్లుగా సమాచారం.. దీంతో అటు టిడిపి నేతలు వైసిపి నేతల మధ్య ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఇరువురు పార్టీ నేతలు పరస్పరం రాళ్ల దాడికి దిగడంతా పలువురు టిడిపి, వైసిపి కార్యకర్తలకు గాయాలైనట్టుగా సమాచారం. దీంతో వెంటనే పోలీసులు ఈ విషయాన్ని తెలుసుకొని ఐదు వర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి అదుపులోకి తీసుకురావడానికి అక్కడ వాస్తవాయువు కూడా ప్రయోగించడం జరిగింది.

అయితే ఈ రాళ్ల దాడిలో సీఐ మురళి కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి దీంతో ఆసుపత్రికి తరలించినట్లుగా తెలుస్తోంది. జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటికి పెద్దారెడ్డి ఇంటికి మధ్యలో ఉన్న కాలేజ్ గ్రౌండ్ లో ఒక రణరంగం యుద్ధ వాతావరణం మారింది. కేవలం సినిమాలను తలపించే విధంగా అక్కడ సన్నివేశాలు ప్రజలను భయభ్రాంతులకు గురై ఎలా చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తాడిపత్రిలో తీవ్ర టెన్షన్ నెలకొన్నట్లు సమాచారం. మరి ఈ గొడవలు ఇప్పటితో సర్దు మునిగేలా అవుతాయో లేదా చూడాలి మరి. మరి ముఖ్యంగా ఈసారి ఎన్నికలు ఫలితాలు వెలుపడ్డాకా మరి ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: