ఏపీ ఎలక్షన్స్ ఫై.. జగన్ అంచనా ఇదే?

praveen
ఆంధ్రాలో ఈసారి అధికారాన్ని చేపట్టబోయే పార్టీ ఏది ప్రస్తుతం ఎక్కడ ఇదే విషయం గురించి చర్చ జరుగుతుంది. అధికారంలో ఉన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మరోసారి తమ పార్టీని రూలింగ్ లోకి వస్తుంది అని ధీమా వ్యక్తం చేస్తుంది. అయితే ఎట్టి పరిస్థితుల్లో జగన్ ను గద్దేదింపాలని అనుకున్న చంద్రబాబు తన రాజకీయ అనుభవాన్ని మొత్తం ఉపయోగించి.. అటు జనసేన బిజెపి పార్టీలతో పొత్తు పెట్టుకుని మరి ముందుకు సాగారు. జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకు వెళ్లడానికి తీవ్రంగానే ప్రయత్నించారు.

 అయితే ఇలా ఎన్నికలు వచ్చాయి అంటే చాలు ఎన్నో సర్వే రిపోర్టులు కూడా హాట్ టాపిక్ గా మారిపోతూ ఉంటాయి అన్న విషయం తెలిసిందే. అయితే కొన్ని సర్వేలు కూటమి విజయం సాధిస్తుంది అని చెప్పినప్పటికీ.. ఎక్కువ శాతం సర్వేలు మాత్రం జగన్ పార్టీని రెండోసారి ఆంధ్రాలో అధికారాన్ని చేజిక్కించుకోబోతుంది అన్న విషయాన్ని చెప్పకనే చెప్పాయి. అయితే గతంతో పోల్చి చూస్తే కొన్ని సీట్లు తగ్గినప్పటికీ రెండోసారి జగన్ సీఎం అవబోతున్నాడు అంటూ సర్వే రిపోర్టులు తెలిపాయి. అయితే ఇటీవల పోలింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. అక్కడక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితులు కూడా చోటుచేసుకున్నాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు విడుదల కాబోతున్నాయి.

 అయితే ఇక ఇప్పుడు ఆయా పార్టీల అధినేతల మనసుల్లో ఏముంది అన్నది మాత్రం హాట్ టాపిక్ గా మారింది.  ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం జగన్ అంచనా ఇదే అంటూ ఒక వార్త వైరల్ గా మారిపోయింది. 115 నుంచి 125 సీట్ల వరకు అటు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేసుకుంటూ ఉండగా.. జగన్ మాత్రం మరిన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామని నమ్మకంతో ఉన్నారట. వైసీపీ వైపు పాజిటివ్ ఓటు ఉందని.. మూడు పార్టీలు కలిపి వైసిపిని టార్గెట్ చేయడంతో సింపతి ఓట్లు కూడా పడ్డాయని జగన్ స్నేహితులకు చెప్పారట. ఇంకోవైపు వృద్ధ మహిళలు వైసీపీకి ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు బారులు తీరారని.. అందుకే రాత్రి దాటిన తర్వాత కూడా పోలింగ్ ప్రక్రియ సాగిందని చెప్పుకొచ్చారట. మొత్తంగా 175 స్థానాలకు గాను 150 వరకు వైఎస్ఆర్సిపి గెలుస్తుందని జగన్ సన్నిహితులతో తెలిపారట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: