కొంప ముంచిన క్రాస్ ఓటింగ్.. ఇక బిఆర్ఎస్ ఒక్క సీటు కూడా కష్టమేనా?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండుసార్లు అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ పార్టీ.. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా గెలిచి హ్యాట్రిక్ కొడతాము అనే నమ్మకంతో ఉంది. కానీ ఊహించని రీతిలో ప్రజలు తీర్పుని ఇచ్చారు. ఏకంగా రెండుసార్లు అధికారాన్ని చేపట్టిన బిఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదాని కట్టబెట్టి ఇక కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకువచ్చారు. ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు గెలవలేక.. ఇక అధికారాన్ని కోల్పోయిన బిఆర్ఎస్.  తర్వాత అయోమయ పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

 పార్టీలోని కీలక నేతలందరూ కూడా కారు దిగి హస్తం గూటికి చేరుకోవడంతో ఇక బిఆర్ఎస్ ఖాళీ అవుతుందేమో అని అనుమానం కూడా ఎంతో మందిలో కలిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బిఆర్ఎస్ పార్టీ అటు పార్లమెంట్ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అయితే పార్టీలో నెలకొన్న  గందరగోల పరిస్థితుల దృశ్య కనీసం గులాబీ పార్టీ ఒక్క సీట్ అయినా గెలుస్తుందా అనే విమర్శలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల  మధ్య కేసీఆర్ బస్సు యాత్ర పార్టీలో కొత్త ఊపును తీసుకొచ్చింది.

 మెదక్,సికింద్రాబాద్, నాగర్ కర్నూల్ సెగ్మెంట్లలో ఇక తప్పకుండా గులాబీ పార్టీ విజయం ఖాయమని లెక్కలు కూడా వేసుకుంది ఆ పార్టీ నాయకత్వం. కానీ క్రాస్ ఓటింగ్ చివరికి కారు పార్టీని  దెబ్బ కొట్టబోతుంది అని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తుంది. గులాబీ పార్టీ పై అసంతృప్తితో ఉన్న ఓటర్లందరూ కూడా అసెంబ్లీ ఎన్నికల్లో  కాంగ్రెస్ వైపు నిలిచారు. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక గతంలో బిఆర్ఎస్ చేసినట్లుగానే చేస్తుంది అని.. ఇక హస్తం పార్టీపై కూడా వ్యతిరేకతతో ఉన్నవాళ్లు చివరికి బిజెపి వైపు మల్లారట. ఇక విశ్లేషకుల అంచనాలు అటు బిఆర్ఎస్ లో అలజడి రేపుతున్నాయి.

 గతంలో బిఆర్ఎస్ పార్టీలో ఉండి ఇక ఆధిపత్యం చెలాయించి విజయం సాధించిన నేతలే.. ఇక ఇప్పుడు ఆ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ దక్కించుకొని పోటీ చేస్తున్నారు. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బిజెపి మధ్య ఫైట్ హోరాహోరీగా ఉండడంతో ఓటర్లు కూడా బిఆర్ఎస్ ను లైట్ తీసుకున్నారని.. ఇక సొంత పార్టీ నేతల ఇతరులకు ఓటు వేసేందుకు రెడీ అయ్యారని ఇలా క్రాస్ ఓటింగ్ తమకు ఎంతగానో అనుకూలంగా మారిపోయిందని బిజెపి లెక్కలు వేసుకుంటుంది. ఇక ఇలాంటి పరిణామాలు అటు బిఆర్ఎస్ లో ఆందోళనకు కారణం అవుతున్నాయి. ఇలా సికింద్రాబాద్, నాగర్ కర్నూల్, పెద్దపల్లి, మెదక్ సెగ్మెంట్లలో మాదే విజయం అనే ధీమాతో ఉన్న కారు పార్టీలో క్రాస్ ఓటింగ్ కలవరం రేపుతోంది ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: