'డియర్ కామ్రేడ్' పని అయిపోయిందట....!!

Mari Sithara
ఈనెల 26వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన విజయ్ దేవరకొండ లేటెస్ట్ మూవీ డియర్ కామ్రేడ్, ప్రస్తుతం మంచి టాక్ మరియు కలెక్షన్స్ తో ముందుకు దూసుకుపోతోంది. ముఖ్యంగా లేడీస్ మరియు యూత్ ఎక్కువగా ఈ సినిమాను వీక్షిస్తున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. ఇకపోతే మరోవైపు ఇటీవల ప్రేక్షుకుల ముందుకు వచ్చిన రామ్, పూరిజగన్నాథ్ ల కలయికలో రూపొందిన ఇస్మార్ట్ శంకర్ సినిమా కూడా హిట్ టాక్ ని సంపాదించి దూసుకుపోతోంది. మంచి అలరించే మాస్ ఎలిమెంట్స్, మరియు యాక్షన్, లవ్ సీన్స్ కలిగిన ఈ సినిమాపై ముఖ్యంగా బి, సి సెంటర్ల ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. 

ఇక డియర్ కామ్రేడ్ విడుదల సమయంలో ఇస్మార్ట్ శంకర్ కు కొంత మేర దెబ్బపడుతుందని అందరూ అనుకున్నారు. అయితే డియర్ కామ్రేడ్ తొలిరోజు ఇస్మార్ కు కొంత మేర కలెక్షన్ తగ్గినప్పటికీ, రెండవ రోజు నుండి మరింత పుంజుకున్నాయని అంటున్నారు. అయితే డియర్ కామ్రేడ్ యువత, లేడీస్ ని అట్రాక్ట్ చేస్తుంటే, ఇస్మార్ట్ ఎక్కువగా మాస్ జనాలను అట్రాక్ట్ చేస్తూ ముందుకు సాగుతోంది. అయితే నేడు ఈ రెండు సినిమాల విషయమై సంచలన సినిమాల దర్శకుడు రామ్ గోపాల్ తన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ, ఇవాళ హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ప్రాంతంలోగల సినిమా థియేటర్ల కలెక్షన్ రిపోర్ట్ ని తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ, ఈ రిపోర్ట్ ని బట్టి చూస్తే ఇస్మార్ట్ శంకర్ కంటే నాన్ ఇస్మార్ట్ సినిమా అయిన డియర్ కామ్రేడ్ పెద్దగా కలెక్షన్ రాబట్టడం లేదు, దాని పని అయిపోయిందంటూ కొంత పరోక్షంగా కామెంట్ చేయడం జరిగింది. 

వాస్తవానికి ఆ పట్టికను పరిశీలిస్తే సుదర్శన్ లో ఇస్మార్ట్ శంకర్ రూ.1,08,062 ల కలెక్షన్ సాధిస్తే, సంధ్య థియేటర్ లో ఆడుతున్న డియర్ కామ్రేడ్ రూ.1,04,590 ల కలెక్షన్ ని సంపాదించడం జరిగింది. అయితే వర్మ ట్వీట్ పై విజయ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. కేవలం రూ.4000 మాత్రమే కలెక్షన్ తేడా ఉన్నంతమాత్రాన వర్మ గారు తమ హీరో సినిమాను తక్కువ చేయడం సరైనది కాదంటూ తమ సోషల్ మీడియా వేదికల ద్వారా ఆయన పై కొంత ఆగ్రహంతో కామెంట్స్ చేస్తున్నారు....!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: