అరవింద్ రామాయణం ఎప్పుడైతే ఎనౌన్స్ చేశారో అప్పటి నుంచే రామాయణం సినిమాకు సంబధించిన అనేక విషయాలు బయటకు వస్తున్నాయి. రాముడిగా ఎవరు నటిస్తున్నారు. రావణాసురుడు ఎవరు. ఎవరైతే బాగుంటారు అనే వాటి గురించే ఆంతా చర్చించుకుంటున్నారు.
రాముడిగా ఎవరైతే బాగుటుంది అనే దానిపై అనేక స్పెక్యులేషన్స్ బయటకు వచ్చాయి. అందులో ఒకటి హృతిక్ రోషన్ ఒకరు. రాముడు ముక్కు పొడవుగా ఆజానుబాహుడిగా ఉంటారు. పొడవైన చేతులతో పాటు కోమలత్వంతో ఉంటాడు. పైగా ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు కాబట్టి బాలీవుడ్ హీరోను ఈ సినిమా కోసం తీసుకుంటే బాగుంటుందని అంటున్నారు.
దీంతో పాటు రావణుడిగా ఎవరిని తీసుకుంటారు అనే దానిపై కూడా ఊహాగానాలు మొదలయ్యాయి. రాముడిగా హృతిక్ ను తీసుకుంటే రావణుడిగా ఎన్టీఆర్ బాగుంటాడని, ఎన్టీఆర్ హావభావాలు, ఆహార్యం అద్భుతంగా ఉంటుందని, అందుకే ఆయన్ను తీసుకోవాలని అంటున్నారు.
ఈ ఇద్దరు సినిమాలో ఉంటె సినిమాకు ప్లస్ అవుతుంది. ఇటు సౌత్ లోను, అటు నార్త్ లోను సినిమాకు మంచి డిమాండ్ పెరుగుతుంది. దర్శక నిర్మాతల మనసులో ఎవరున్నారో.. ఎవర్ని తీసుకోవాలని అనుకుంటున్నారో మరి.