నాని లుక్ పై సందేహాలు !

Seetha Sailaja
నాని ‘గ్యాంగ్ లీడర్’ హంగామా నిన్న విడుదలైన ప్రీ లుక్ తో మొదలైంది. ఈ ప్రీ లుక్ లో మొహాలు చూపించకపోయినా ఐదుగురు ఒకరు చేతుల మీదుగా మరొకరు వేసుకోగా కింద వాళ్లందరికీ అభయం ఇస్తూ నాని తన చేతిని పెట్టడం ఆకట్టుకునేలా ఉంది. 

దీనితో నలుగురు మహిళలకు నాని ‘గ్యాంగ్ లీడర్ గా మారబోతున్నాడు అని వస్తున్న ఈమూవీ స్టోరీ లైన్ కథనాలకు నిన్నటి ప్రీ లుక్ పోస్టర్ బలాన్ని ఇచ్చింది. ఇప్పటికే చిరంజీవి మూవీ టైటిల్ గ్యాంగ్ లీడర్ ను తీసుకోవడం ఈమూవీ ద్వారా నాని చేస్తున్న సాహసం అని భావిస్తూ ఉంటే ఈమూవీలో మరొక సాహసం నాని చేస్తున్నట్లు తెలుస్తోంది. 

నిన్న నాని తన లేటెస్ట్ లుక్ గురించి క్లారిటీ ఇస్తూ ఒక చిన్న వీడియో రిలీజ్ చేసాడు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఆ వీడియోలో నాని లుక్ కనిపించడం చాలామందిని ఆశ్చర్య పరిచింది. నాని డైటింగ్ చేశాడో లేక జిమ్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాడో తెలియకపోయినా ఈ వీడియోలో నాని ముఖంలో బాగా మార్పులు కనిపించాయి. అదేవిధంగా అతడి హెయిర్ స్టైల్ మీసకట్టులో కూడ స్పష్టమైన మార్పులు కనిపించాయి.  

దీనితో ‘గ్యాంగ్ లీడర్’ అన్న టైటిల్ పెట్టుకున్నందుకు ఆ టైటిల్ కు తగ్గట్టుగా మ్యాన్లీగా ఉండాలి కానీ ఇలా సన్నబడిన మొఖంతో నాని కనిపించడంతో అతడి మొఖంలో గ్రేస్ తగ్గింది అన్న కామెంట్స్ మొదలైపోయాయి. అయితే నాని ‘గ్యాంగ్ లీడర్’ లో ఇలా కనిపించడనీ ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ మూవీకి సంబంధించి గెటప్ ఇది అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: