మణిరత్నం గోల్డెన్ హ్యాండ్ అతనికి ఎంతవరకు కలసి వస్తుందో.....??

Mari Sithara
భారతీయ సినిమా ఇండస్ట్రీలో అప్పటికీ ఇప్పటికీ నిలిచి ఉండే దర్శకుల్లో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన వారు కొద్దిమంది వున్నారు. అయితే అటువంటి వారిలో ముందు వరుసలో నిలిచే వ్యక్తుల్లో మణిరత్నం కూడా ఒకరు అనే చెప్పాలి. ఇక ఆయనతో ఒక్క సినిమా చేసే అవకాశం వస్తే చాలు, తమ జన్మ ధన్యం అయినట్లే అని దేశవ్యాప్తంగా ఉన్న నటీనటులు భావిస్తుంటారు. ఇక ఓవైపు దర్శకుడిగా మాత్రమే కాక, తన ఓన్ బ్యానర్ పై భార్య సుహాసినితో కలిసి సినిమాలు కూడా నిర్మిస్తుంటారు మణిరత్నం. ఇక ఆ విధంగా త్వరలో శివాజీ గణేష్ మనవడు, ప్రభు తనయుడు విక్రమ్ ప్రభు హీరోగా రూపొందనున్న 'వానమ్ కట్టాటమ్' అనే సినిమాను అయన నిర్మించనున్నారు. 

ఇటీవల తమిళ, తెలుగు భాషల్లో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఐశ్వర్య రాజేష్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ సినిమా ద్వారా ప్రఖ్యాత సింగర్ సిద్ శ్రీరామ్, తొలిసారి సంగీత దర్శకుడిగా మారబోతున్నట్లు కోలీవుడ్ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇటీవల తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో తన వినసొంపైన గాత్రంతో ఎన్నో అద్భుతమైన పాటలను పాడి, శ్రోతలను ఆకట్టుకున్న సిద్ శ్రీరామ్ కు సంగీతం పై కూడా కొంత ఇష్టం మరియు అవగాహన ఉందట. ఇక ఈ విషయాన్ని గ్రహించిన మణిరత్నం అతడిని పిలిపించి, తన సినిమాకు సంగీత దర్శకుడిగా పనిచేయమని కోరారట. 

ఆ వార్త విన్న వెంటనే శ్రీరామ్ కు పట్టలేని సంతోషం కలిగిందని, మణిరత్నం గారి నిర్మాణంలో రూపొందుతున్న సినిమాకి తాను సంగీతం అందించడం ఒక వరంగా భావిస్తున్నట్లు శ్రీరామ్ ఎగిరి గంతేశాడట. కొత్త దర్శకుడు ధనశేఖరన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయిని టాక్. మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీగా రాబోతున్న ఈ సినిమాతో తప్పకుండా శ్రీరామ్ సంగీత దర్శకుడిగా పెద్ద హిట్ కొట్టడం ఖాయమని, ఎందుకంటే గోల్డెన్ హ్యాండ్ గా భావించే మణిరత్నం గారు, తప్పకుండా శ్రీరామ్ కు సంగీత దర్శకుడిగా లైఫ్ ఇస్తారని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఇక దీనిపై మరికొద్దిరోజుల్లో అధికారిక ప్రకటన కూడా రాబోతోందట....!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: