రాఘవేంద్రరావు సూచనకు షాక్ అయిన రాజమౌళి !

Seetha Sailaja
దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు నిర్వహించే టెలి ఫిలిమ్స్ లో రాజమౌళి తన కెరియర్ తొలి నాళ్లలో నెలకి 2000 రూపాయల జీతానికి అప్పట్లో పని చేసిన విషయం చాలా కొద్ది మందికి మాత్రమే తెలిసిన విషయం. అలంటి రాజమౌళి నేషనల్ సెలిబ్రీతీగా మారిపోయినా తన గురువు రాఘవేంద్రరావు మాట అంటే ఇప్పటికి రాజమౌళికి ఎంతో గౌరవం. అలాంటి రాఘవేంద్రరావు తన ప్రియ శిష్యుడు రాజమౌళికి ఒక సినిమా చూడమని సజెస్ట్ చేయడం ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. 

గతవారం విడుదల అయిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’  సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సినిమాను చూసిన రాఘవేంద్రరావు అద్భుతమైన సినిమా తీశారంటూ చిత్ర యూనిట్‌ను అభినందించారు. అంతేకాకుండా తనను కలిసిన చిత్ర హీరో నవీన్ పోలిశెట్టిని ప్రత్యేకంగా మెచ్చుకోవడమే కాకుండా అతడికి మంచి భవిష్యత్తు ఉంటుందని ఆశీర్వదించాడు. 

‘‘చాలా సంతోషంగా ఉంది. ఈ సంవత్సరం కొత్తగా వచ్చిన హీరో నవీన్ ఎన్నో సినిమాల అనుభవం ఉన్న యాక్టర్‌లా ఈ సినిమాలో చేశాడు. అన్ని రకాల వేరియషన్స్‌తో.. డిఫరెంట్ వాయిస్ మాడ్యూల్స్‌తో చాలా బాగా చేశాడు. మరీ ముఖ్యంగా హీరోయిన్‌ను పెట్టుకుని కూడా డ్యూయెట్ సాంగ్ లేకుండా చేయడం అంటే వాళ్లు ఎంచుకున్న స్క్రిప్ట్ అంత పవర్‌ఫుల్‌గా ఉంది. తప్పకుండా ఈ సినిమా బిగ్ హిట్ అవుతుంది. నవీన్‌కు మంచి భవిష్యత్తు ఉంది. ప్రేక్షకులు ఎవరైనా ఈ సినిమా చూడకపోతే చూడండి. నా ప్రియ శిష్యుడు రాజమౌళి కూడా తప్పకుండా ఈ సినిమా చూస్తాడని ఆశిస్తున్నా. రాజమౌళీ ఈ సినిమా చూడకపోతే ఓ సారి చూడు.’’ అంటూ రాగవేంద్ర రావు ఒక సందేశం విడుదల చేసారు.  

అయితే ఈమధ్య  విడుదల అవుతున్న చాల సినిమా లపై తన అభిప్రాయాలు చెప్పకుండా మౌనం వహిస్తున్న రాజమౌళి తన గురువు సూచనను ఎంత వరకు అనుసరిస్తాడో చూడాలి.  ప్రస్తుతం రెండవ వారంలోకి అడిగుపెట్టిన ఈ చిత్రానికి మంచి కలెక్షన్స్ వస్తున్న నేపధ్యంలో ఈసినిమాకు రాజమౌళి సపోర్ట్ కూడ మరింత హిట్ కొట్టే ఆస్కారం ఉంది..   



మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: