వరుస హిట్స్ కోసం జూనియర్ ఎన్టీఆర్ పక్కా ప్లానింగ్....!!

Mari Sithara
ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోల్లో వరుస విజయాలతో దూసుకుపోతున్న హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొన్నాళ్ల క్రితం డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన టెంపర్ మూవీ తో తన సినిమా సెలక్షన్ స్టైల్ మరియు నటనలో మార్పు తీసుకువచ్చిన ఎన్టీఆర్, అక్కడినుండి వరుసగా హిట్స్ కొడుతూ ముందుకు సాగుతున్నారు. ఇక ప్రస్తుతం దర్శకదీరుడు రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ లో ఆయన నటిస్తున్న విషయం తెలిసిందే. బాహుబలి సినిమాల సక్సెస్ ల తరువాత వస్తున్న రాజమౌళి సినిమా కాబట్టి, ఆర్ఆర్ఆర్ పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. అదీకాక ఈ సినిమాని డివివి దానయ్య ఏకంగా రూ.400 కోట్లకుపైగా ఖర్చు చేసి నిర్మిస్తుండడంతో దేశవ్యాప్తంగా అందరి దృష్టి ఈ సినిమాపై ఉంది. 

అయితే ఈ సినిమా రేపు విడుదల తరువాత చాలావరకు అంచనాలు అందుకుంటే అద్భుతమైన కలెక్షన్ రానట్టే అవకాశం ఉంటుంది. ఇక ఈ సినిమా తరువాత ఎన్టీఆర్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో కలిసి ఒక సినిమా చేయనున్నట్లు ఇటీవల పలు మీడియా మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఒకరకంగా అది నిజం అని కూడా సమాచారం అందుతోంది. ఇటీవల త్రివిక్రమ్ తో చేసిన అరవింద సమేత మంచి అవ్వడంతో మరొక్కసారి ఆయనకే ఓటేశారట ఎన్టీఆర్. ఈ సారి మంచి ఎంటర్టైనింగ్ పంధాలో సాగె ఫ్యామిలీ డ్రామాగా వీరిద్దరి సినిమా ఉండనుందని సమాచారం. అది ఏ మాత్రం అంచనాలు అందుకున్నా హిట్ అవ్వడం ఖాయమే. ఇకపోతే ఆ సినిమా తరువాత ఎన్టీఆర్, అనిల్ రావిపూడితో సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. నిజానికి అనిల్ ఫస్ట్ మూవీ పటాస్ ఎన్టీఆర్ కోసం రాసుకున్న కథే, అయితే అప్పట్లో ఎన్టీఆర్ వేరే సినిమాలతో బిజీగా ఉండడంతో అదే కథను కళ్యాణ్ రామ్ తో చేసాడు అనిల్. 

ఆ సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. అయితే అప్పటినుండి ఎన్టీఆర్ కోసం వెయిట్ చేస్తున్న అనిల్, ఇటీవల ఆయనను కలిసి ఒక స్టోరీ లైన్ చెప్పారని, అది నచ్చిన ఎన్టీఆర్, పూర్తి స్థాయి స్క్రిప్ట్ సిద్ధం చేసుకువస్తే, అతి త్వరలో సినిమా చేద్దాం అని మాటిచ్చారట. ఇక ఓవైపు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ తో సరిలేరు నీకెవ్వరు సినిమాషూటింగ్ పనులతో బిజీగా ఉన్న అనిల్, ఆ సినిమా పూర్తి అయ్యేలోపు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమా కథను సిద్ధం చేసి ఆయనకు వినిపించడం జరుగుతుందని సమాచారం. ఇక మొత్తంగా దీన్ని బట్టి చూస్తే మన యంగ్ టైగర్ వరుసగా మంచి దర్శకులని పట్టి వారితో ఎలాగైనా గట్టి హిట్స్ కొట్టాలని సంకల్పించినట్లు తెలుస్తోంది. ఇక ప్రస్తుతం ప్రచారం అవుతున్న ఈ వార్తలు కనుక నిజమే అయితే యంగ్ టైగర్ ఫ్యాన్స్ కు ఇవి గుడ్ న్యూస్ అనే చెప్పాలి.....!!


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: