జూ. ఎన్టీఆర్ గెస్ట్ రోల్ చేసేందుకు సిద్ధమయ్యాడా?
చిరంజీవి, నాగార్జున లాంటి వాళ్ళు ఇది వరకు ఇలా చేశారు. అయితే యంగ్ హీరోల్లో మాత్రం ఇంతవరకు ఎవరూ అతిధి పాత్రలు చేయలేదు. అయితే తాజాగా వచ్చిన ఒక వార్త ఈ సాంప్రదాయానికి తెర తీసేలా ఉంది. అవును యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ ఒక సినిమాలో అతిధి పాత్రలో కనిపించబోతున్నాడట.
ఆర్ ఆర్ ఆర్ సినిమాతో ఎన్టీఆర్ బిజీగా ఉన్న సంగతొ తెలిసిందే. ఆ సినిమా ప్రాసెస్ లో ఉండగానే గెస్ట్ రోల్ కోసం సిద్ధం కావడమంటే ఆ రోల్ ఎంత స్ట్రాంగ్‌గా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నాగేంద్ర అనే దర్శకుడు రూపొందిస్తున్న చిత్రంలో ఓ కీలకమైన పాత్ర కోసం ఎన్టీఆర్‌ని సంప్రదించగా ఆయన ఓకే చెప్పనట్లు సమాచారం. కేవలం 10 నిముషాలు మాత్రమే ఉండే ఈ రోల్లో నటించేందుకు ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట.
ఈ కామియోకు సంభందించిన నేరేషన్ విన్న ఎన్టీఆర్.. ఫైనల్ గా ఓ సారి మొత్తం స్క్రిప్ట్ విని, అది తను మాత్రమే చేయగలిగే ప్రత్యేకమైన పాత్ర అయితే తప్పకుండా చేస్తానని మాట ఇచ్చారట. అయితే ఈ గెస్ట్ రోల్ లో చేయమని ఎన్టీఆర్‌కి సూచించింది ఆయన అత్యంత సన్నిహితుడైన మహేష్ కోనేరు అని తెలుస్తోంది.
సఖి అనే టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాను మహేష్ కోనేరు నిర్మిస్తున్నాడు. ఇప్పటికే హైదరాబాద్‌లో కొంత భాగం షూటింగ్ ఫినిష్ చేసిన చిత్రయూనిట్..త్వరలోనే ఓ భారీ షెడ్యూల్ కోసం యూరప్ వెళ్లనుందని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఆర్ఆర్ఆర్' మల్టీస్టారర్ సినిమాలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.