ట్రైలర్ చూడగానే ఖచ్చితంగా సినిమా చూడాలనిపించాలి. అలాంటి ఎంటర్టైన్మెంట్తో కూడిన మెసెజ్ కలగలిసిన సినిమా మన ముందుకు రాబోతోంది. అదే.. చేతన్ మద్దినేని, కాశిక్ వోహ్రా హీరో హీరోయిన్లుగా, నరేష్ కుమార్ దర్శకత్వం వహించిన ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ మూవీ.
చదువులు, ర్యాంకుల పేరుతో పిల్లలను వేధించే తల్లిదండ్రులు, మన విద్యావ్యవస్థ వల్ల పిల్లలు ఎలాంటి పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందన్నదే ‘ఫస్ట్ ర్యాంక్ రాజు’ సినిమా సబ్జెక్టు. తాజాగా విడుదలైన ఫస్ట్ ర్యాంక్ రాజు ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ట్రైలర్ చూస్తుంటే ప్రస్తుత విద్యావ్యవస్థలోని లోపాలపై ఒక సెటైరికల్ మూవీ అనిపిస్తుంది. ఈ మూవీ నరేష్ తన కొడుకైన రాజు భవిష్యత్ బాగుండాలని చిన్నప్పటినుండి పుస్తకాలే ప్రపంచంగా, ర్యాంక్ లే లక్ష్యంగా సామజిక అంశాలపై, మంచి చెడులపై అవగాహన లేకుండా పెంచుతాడు. అలా పెరిగిన రాజు సొసైటీలో చాలా అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చివరికి జాబ్ విషయంలో కూడా ర్యాంక్ కాదు, జనరల్ నాలెడ్జ్ అవసరమని తెలుస్తుంది. నీలాంటి ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ అయినా, నాలాంటి బ్యాక్ బేంచ్ స్టూడెంట్ దగ్గరికే జాబ్ కోసం రావాలి.. అంటూ ఈ ట్రైలర్లో ప్రకాష్ రాజ్ విద్యావ్యవస్థపై తిరుగుని బాణం వదులుతాడు.
సామజిక అవగాహన లేని రాజుగా,అలాగే అల్ట్రా మోడ్రన్ స్టూడెంట్ గా రెండు షేడ్స్ లో హీరో నటన బాగుంది. హీరోయిన్ కాశిక్ గ్లామర్ గా కనిపిస్తుంది. ఎమోషనల్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ టీజర్ తో అంచనాలు పెరిగేలా చేసింది. గ్యారంటీ గా ప్రేక్షకుడికి వినోదం పంచె అన్ని అంశాలు ఈ మూవీలో ఉన్నాయనిపిస్తోంది. ఈ ట్రైలర్లో వెన్నెల కిషోర్, ప్రియదర్శి, పోసాని కామెడీ బాగుంది.
ఫస్ట్ ర్యాంక్ స్టూడెంట్ చివరికి తనని తానూ ఎలా మార్చుకున్నాడు? తన గోల్ ఎలా సాదించాడనేదే సినిమా కథ అని ట్రైలర్ను చూస్తే అర్థమవుతోంది. హీరో హీరోయిన్ ఎవరో కొత్తవాళ్లే అయినా ప్రకాశ్ రాజ్, రావు రమేష్, సీనియర్ నరేష్, బ్రహ్మానందం ఇలా ప్యాడింగ్ యాక్టర్స్ ను బాగా వాడుకున్నారు. ఆలోచింపజేస్తూ నవ్వించే ఫస్ట్ ర్యాంక్ రాజు మూవీ జూన్ 21న విడుదల కాబోతోంది.