బట్టలు లేని ఫోటోలు పంపు అంటే... పంపి షాక్ ఇచ్చిన సింగర్..?
తాజాగా ఇటీవల చిన్మయి చేసిన ఓ ట్వీట్ వైరల్ అవుతోంది. సోషల్ మీడియాలో చిన్మయిని ఓ వ్యక్తి న్యూడ్ ఫోటోలు పంపాలని కోరాడు. అతడి ప్రశ్నకు చిన్మయి ఏమాత్రం ఆగ్రహం వక్తం చేయకుండా అదిరిపోయేలా సమాధానం ఇచ్చింది. అతడు అడిగినట్లుగానే న్యూడ్ పిక్స్ పంపింది. కానీ అవి అతడు కోరుకున్న ఫోటోలు కాదు. నాకు నచ్చిన న్యూడ్ పిక్స్ ఇవే అంటూ చిన్మయి లిప్ స్టిక్ ఫోటోలు షేర్ చేసింది.
హ్యూమన్ స్కిన్ కలర్ లో ఉండే కొన్ని లిప్ స్టిక్స్ ని న్యూడ్ లిప్ స్టిక్స్ అని పిలుస్తారు. సదరు చిత్రాలను చిన్మయి అతడికి షేర్ చేసింది. దీనితో చిన్మయి సమాధానానికి నెటిజన్లు పొగడ్తల వర్షం తో ముంచెత్తుతున్నారు. అంతేకాకుండా సదరు వ్యక్తితో జరిగిన సంభాషణ మొత్తం చిన్మయి ట్విటర్ లో షేర్ చేసింది.