పనిగట్టుకొని నా పేరును చెడగొట్టటం న్యాయం కాదు: ఛానెల్‌పై సినీ నటి ఆగ్రహం

బాలీవుడ్‌ ప్రఖ్యాత నటి  హుమా ఖురేషీ ఒక జాతీయ హిందీ వార్తా ఛానల్‌పై తన ఆగ్రహం వ్యక్తం చేశారు. సల్మాన్‌ ఖాన్‌ సోదరుడు సొహైల్‌ ఖాన్ తన భార్య సీమా ఖాన్‌తో కలిసి ఇటీవల ‘స్టూడెంట్‌ ఆఫ్ ది ఇయర్‌ 2’ స్పెషల్‌ స్క్రీనింగ్‌ వేడుకకు హాజరయ్యారు. ఆ సినిమా చూడటానికి హుమా ఖురేషీ కూడా వెళ్లారు. హుమా ఖురేషీ , సొహైల్‌ ఖాన్  లు ఒకప్పుడు ప్రేమించుకున్నారని బాలీవుడ్ కోడై కూసింది. 

వారి గత ప్రేమాయణాన్ని ఉటంకించిందా అన్నట్లు ఆ వార్తా చానల్  ‘స్పెషల్‌ స్క్రీనింగ్‌ చూసేందుకు వచ్చిన సొహైల్‌ ఖాన్  దంపతులు, హుమా ఖురేషీ ను పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దాంతో హుమా చాలా బాధపడ్డారు’ అని ప్రసారం చేసింది.  

ఆ కథనం కాస్తా హుమా ఖురేషీ  దృష్టికి వచ్చింది. దాంతో ఆమె ఆ ఆర్టికల్‌ ను ట్యాగ్‌ చేస్తూ, ‘మీ చెత్త ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇవ్వలేదని నా గురించి ఇలాంటి చెత్తంతా రాస్తారా? సిగ్గులేకపోతే సరి. నా పేరును చెడగొట్టడానికి మీకెంత ధైర్యం. ఇలా చేసినందుకు నాకు, సొహైల్‌ దంపతులకు క్షమాపణలు చెప్పండి. అసలు మీకు నైతిక విలువలే లేవు. మీలాంటి ఇడియట్స్‌ను నటీనటులు పట్టించుకోరు. దానర్థం మీరంటే మాకు భయమని అనుకుంటున్నారా? అదేంలేదు’ అని మండిపడ్డారు హుమా ఖురేషీ. 


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: