టాలీవుడ్ లో ఒక ట్రెండ్ సృష్టించిన సినిమా ‘అర్జున్ రెడ్డి’. కొత్త దర్శకుడు సందీప్ వంగా దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ‘అర్జున్ రెడ్డి’ ఎన్ని విమర్శలు పొందిందో అంత సూపర్ హిట్ అయ్యింది. ఈ సినిమా ట్రైలర్ చూసి ఇది బోల్డ్ కంటెంట్ అని..ఇందులో లిప్ లాక్ సీన్లు బాగా ఉన్నాయని.. యూత్ చెడిపోతారని తెగ కామెంట్స్ విమర్శలు వచ్చాయి. అంతే కాదు ఈ సినిమా పోస్టర్లపై కూడా ఎన్నో వివాదాలు వచ్చాయి..ఈ సినిమా రిలీజ్ చేయవొద్దని పెద్ద గొడవలే జరిగాయి. అన్ని ఇబ్బందులు దాటుకొని థియేటర్లో ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ అయ్యింది.
మొదటి రోజే ఈ సినిమా పాజిటీవ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా ఇప్పటి వరకు ఎవరూ చూడని ఓ మంచి లవ్ స్టోరి అని ఆడియన్స్ మెచ్చుకున్నారు. అంతే కాదు ఈ సినిమాలో విజయ్ దేవరకొండ నటనకు సినీ ప్రముఖులే కాదు అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చుకున్నారు. ఈ సినిమా తమిళ, హిందీ భాషల్లో కూడా చేశారు. తమిళ్ లో విక్రమ్ కుమారుడు ధృవ్ నటిస్తున్నారు. బాలీవుడ్ లో షాహిద్ కపూర్ కపూర్..షాలిని పాత్రలో కైరా అద్వాని నటిస్తుంది. బాలీవుడ్ లో కూడా సందీప్ వంగనే దర్శకత్వం వహిస్తున్నారు.
తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో హీరో మోషన్స్ కు సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేశారు. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేయడం చూస్తుంటే..బాలీవుడ్ లో కూడా ఇదో సెన్సేషన్ అవుతుందని అంటున్నారు. జూన్ 21వ తేదీన ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి హిందీలో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో చూడాలి.