టాలీవుడ్ లో ఆ మద్య రాంగోపాల్ వర్మ తీసిన రక్త చరిత్ర సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది బాలీవుడ్ బ్యూటీ రాధికా ఆప్టే. ఆ తర్వాత బాలకృష్ణతో లెజెండ్, డిక్టేటర్ సినిమాల్లో నటించింది. ఎప్పుడూ వివాదాల్లో ఉండే రాధికా ఆప్టేకు ఆఫర్లు కూడా ఆ తరహాలోనే వస్తుంటాయి. ఆ మద్య కబాలి సినిమాలో రజినీకాంత్ సరసన నటించింది. రాధికా ఆప్టే సినిమాల్లో కన్నా ఇతర విషయాల్లో ఎన్నో వివాదాల్లో మీడియాలో హల్ చల్ చేసిన విషయం తెలిసిందే. మంచి నటిగా పేరు తెచ్చుకోవడమే కాదు.. అవసరమైతే నగ్నంగా నటించేందుకు కూడా సందేహించదు.
ఇక లైంగిక వేధింపుల గురించి.. సౌత్ లో హీరోయిన్లను గ్లామర్ డాల్స్ గా చూపించడం గురించి ఓపెన్ గా మాట్లాడగల ధైర్యం ఆమె సొంతం. ఆ మద్య తెలుగు హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా రాధికా ఆప్టే తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఈ ఫోటోలో ఒక బోటుపై చిల్ అవుట్ అవుతోంది రాధిక. అడ్డంగా చారలు ఉండే ఒక బికినీని ధరించి బోటుపైన ఉండే స్టెయిన్ లెస్ స్టీల్ రెయిలింగ్ పై కూర్చుంది. అయితే ఈ ఫోటోకు ఈ పడవలో కూర్చునేందుకు మొత్తానికి ఒక ప్రదేశాన్ని వెతుకున్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చింది.
హాట్ హాట్ గా కనిపిస్తున్న ఈ ఫోటోకు ఈ క్యాప్షన్ కాస్త వెరైటీగానే అనిపిస్తుంది. ఈ ఫోటోకి ఒక్కరోజులోపలే నెటిజనులు మూడున్నర లక్షల లైకులు కొట్టడమే కాకుండా ఎన్నో ఇంట్రస్టింగ్ కామెంట్స్ పెట్టారు. ఒకరు మిలియన్ డాలర్ స్మైల్ అన్నారు. ఓ అభిమానిక ఈస్ట్ ఆర్ వెస్ట్ రాధిక ఈజ్ ది బెస్ట్ అని కాంప్లిమెంట్ ఇచ్చాడు. ప్రస్తుతం ధిక 'ది ఆశ్రమ్'..'ది వెడ్డింగ్ గెస్ట్' అనే ఇంగ్లీష్ సినిమాలలో నటిస్తోంది